For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఈ రాశి వారికి శృంగారం విషయంలో మంచిగా ఉంటుంది...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మార్గశిర మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -16 December 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Virgo Horoscope 2022:కన్యరాశి వార్షిక రాశిఫలాలు:ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు, వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుందిVirgo Horoscope 2022:కన్యరాశి వార్షిక రాశిఫలాలు:ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు, వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుంది

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఓపికతో పని చేయాలి. మీరు తెలివిగా వ్యవహరించకపోతే, మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు ఉద్యోగులకు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీకు అదనపు టాస్క్ కేటాయించబడొచ్చు. మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులు డబ్బు విషయంలో తొందరపడొద్దు. మీరు అజాగ్రత్తగా ఉంటే నష్టం మీకే. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీకు చాలా భారంగా భావించొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు అనవసర విషయాలకు దూరంగా ఉండండి. అలాగే, ల్యాప్‌టాప్ మరియు మొబైల్‌కు దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు కార్యాలయంలో చిన్న పనులైనా చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు రవాణా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీ పనులు సాఫీగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి అసంతృప్తిని తొలగించడానికి ప్రయత్నించొచ్చు. మీరు మీ ప్రియమైనవారి మద్దతును కూడా పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. అయితే, మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండడం ద్వారా విజయం సాధించొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. అలాగే ఇతరుల పనుల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు లాభాలను ఆర్జించడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో శృంగారపరంగా మంచిగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీ ప్రియమైన వ్యక్తి చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీరు వారి నుండి విలువైన బహుమతిని కూడా పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు బయటి ఫుడ్ ను తగ్గించాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

Surya Rashi Parivartan 2021:ధనస్సులోకి సూర్యుని సంచారం..12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...Surya Rashi Parivartan 2021:ధనస్సులోకి సూర్యుని సంచారం..12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఆస్తికి సంబంధించిన పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. దీంతో పాటు, మీరు నిలిచిపోయిన పనులను పూర్తి చేయొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆఫీసులో బాస్ మూడ్ చాలా బ్యాడ్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని గమనించండి. అలాగే, పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఇంటి సభ్యుల మద్దతును పొందుతారు. ముఖ్యంగా ఇంటి పెద్దలతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో ప్రతిష్ట పెరుగుతుంది. మీ పనితీరుతో బాస్ కూడా చాలా సంతోషిస్తారు. త్వరలో మీరు కూడా పురోగతి సాధించొచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీరు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఇంకోవైపు మీరు వైద్యులు మరియు మందుల కోసం చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తి యొక్క ప్రేమ మరియు మద్దతు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ ధైర్యాన్ని ఉంచుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఆందోళన మరియు అలసట పెరగడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఈరోజు మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కష్టపడి పని చేయండి. త్వరలో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. మరోవైపు వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలు పొందగలరు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే, ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీ తీవ్రమైన గృహ సమస్య ఈరోజు ముగియవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చర్మానికి సంబంధించిన సమస్య ఉండవచ్చు. పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

Cancer Horoscope 2022: కర్కాటక రాశికి ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు మరియు వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుంది?Cancer Horoscope 2022: కర్కాటక రాశికి ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, డబ్బు మరియు వ్యాపార భవిష్యత్తు ఎలా ఉంటుంది?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో పెద్దగా ప్రయోజనం పొందలేరు. మీరు వ్యాపారవేత్త అయితే మరియు ఇటీవల మీరు కొన్ని కొత్త పనిని ప్రారంభించినట్లయితే, ఈరోజు మీ మార్గంలో పెద్ద అడ్డంకి ఉండొచ్చు. అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సమస్య సకాలంలో పరిష్కరించబడుతుంది. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలో బాస్ యొక్క కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు పెండింగ్ పనులపై వారి కోపం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అననుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ ఇంటి పెద్దలతో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ వైపు చాలా ప్రశాంతంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, కొన్ని దీర్ఘకాలిక పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారస్తులు ఈరోజు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ పనిలో చట్టపరమైన అడ్డంకులు ఉంటే, ఈరోజు అది తొలగిపోయే అవకాశం ఉంది. మీ పనులు మరోసారి సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సులభంగా పని చేయగల మీ కళ ఈ రోజు మీ యజమానిని బాగా ఆకట్టుకుంటుంది. మీరు త్వరలో ఉన్నత స్థానాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. ఆలోచించకుండా ఖర్చు చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదురుకావచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వస్త్ర వ్యాపారులు ఈరోజు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. అదే సమయంలో, ఇనుము వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అయితే, కొన్ని సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, ఈ సమయం దానికి సరైనది కాదు. ఉద్యోగస్తులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు కష్టమైన పని అప్పగించబడవచ్చు. మీరు దాని గురించి భయపడే బదులు మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు పొదుపుపై ​​ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత మంచిది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో ఒక పెద్ద ప్రాజెక్ట్‌పై పని చేస్తుంటే, ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీరు గొప్ప విజయాన్ని పొందొచ్చు. మరోవైపు, విదేశీ కంపెనీలో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశం బలంగా ఉంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ లాభాలను పొందొచ్చు. ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పని చేస్తే, ఈరోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా, ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ ప్రియమైన వారు నిర్లక్ష్యం చేయబడతారు. మీకు కీళ్లనొప్పుల ఫిర్యాదు ఉంటే, ఈరోజు మీ సమస్య కొంచెం పెరగొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఈరోజు ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు మొదలైన వాటి వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో బాస్‌తో ముఖ్యమైన చర్చను కలిగి ఉండొచ్చు. వారు మీకు ఏదైనా సలహా ఇస్తే, మీరు దానిని పరిగణనలోకి తీసుకోవాలి. మరోవైపు, మీరు విదేశీ కంపెనీలో పని చేయాలనుకుంటే, మీరు దీని కోసం మరింత కష్టపడాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకండి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు చెడిపోవచ్చు. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరులను జోక్యం చేసుకోనివ్వకండి. ఆరోగ్య పరంగా ఈరోజు తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఆందోళనలు పెరగొచ్చు. ప్రత్యేకించి మీరు రుణం తీసుకున్నట్లయితే, మీరు ఒత్తిడికి గురవుతారు. వాయిదాలను క్రమంగా చెల్లించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. మీ ఇంటి సభ్యుల ఐక్యతకు భంగం కలగొచ్చు. ఇది కాకుండా, ఆస్తికి సంబంధించిన పాత కేసు ఈరోజు బయటపడొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీ వ్యాపార నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, ఇది సరైన సమయం కాదు. మీ నెమ్మదైన వేగం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి రోజుగా ఉండే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -16 December 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Wednesday, December 15, 2021, 18:02 [IST]
Desktop Bottom Promotion