Today Rasi Phalalu :ఓ రాశి ఉద్యోగుల విదేశీ కల నెరవేరొచ్చు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -27 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఎవ్వరిపైనా ఆధారపడకుండా తమ పనులను తాము చేసుకోవాలి. వ్యాపారులకు ఈరోజు కొన్ని వివాదాలు ఉండొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీకు తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే ఈరోజు డీహైడ్రేషన్ సమస్య ఎదురుకావొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

మీరు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇమ్యూనిటీ పవర్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. దీని వల్ల మీరు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు పని విషయంలో ఏదైనా పెద్ద మార్పులు దూరంగా ఉండాలి. తొందరపాటులో ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. పనితో పాటు ఈరోజు ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణం వల్ల మీకు చాలా లాభం చేకూరనుంది. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో బాస్ కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. లేదంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రియమైన వారితో ఈరోజు మంచిగా గడుపుతారు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు ప్రశాంతమైన మనసుతో పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు పాత కోర్టు కేసుల నుండి బయటపడగలరు. అదే సమయంలో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఈ కారణంగా భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, మీకు తలనొప్పి, అలసటతో పాటు ఇతర సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కారణంగా మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ లాభాలను పొందుతారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు సౌకర్యవంతమైన విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ఎక్కువ కష్టపడాలి. మీరు అనవసరంగా బాస్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నించొద్దు. దానికి బదులుగా మీ పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు నష్టం రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీరు మీ ప్రత్యర్థులను ఓడించగలరు. మీ స్థానం బలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల సలహాలను పాటించాలి. మీ పని సకాలంలో పూర్తవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీరు మీ ప్రియమైన వారిపై నమ్మకాన్ని పెంచుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు రావొచ్చు. మీరు కోరుకున్న పొందే ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉండాలి. త్వరలో మీరు విజయాన్ని పొందుతారు. మీ మార్గంలో కొన్ని అడ్డంకులు వస్తున్నట్లయితే, ఈరోజు మీ సమస్య పరిష్కరించబడుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఇటీవల ఏదైనా ఆపరేషన్ జరిగి ఉంటే, మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. మీ సౌకర్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైన రోజు. ఈరోజు దుబారా ఖర్చులు చేయొద్దు. పని విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో ఉన్నతాధికారులతో వాగ్వాదం పడొచ్చు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, మీరు ప్రణాళిక ప్రకారం పని చేయాలి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి మద్దతు పొందుతారు. ఆర్థిక పరమైన విషయంలో ఈరోజు సన్నిహితుల నుండి సహాయం పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు విదేశీయాత్ర కల నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు చూడొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, May 27, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion