For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్..! టిక్ టాక్ 2019 : టాప్ -10 వైరల్ వీడియోలను చూస్తే మీరు కచ్చితంగా షాకవుతారు..

వీడియోలో స్విమ్మంగ్ పూల్ పేలుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందులో మంచి ట్విస్ట్ ఉంటుంది. అదేంటో మీరే చూడండి. ఈ వీడియోను 7 మిలియన్లకు పైగా లైక్ చేశారు

|

ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ గా తయారవుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలాు ఈ విశ్వంలో జరిగే ఎన్నెన్నో వింతలు, విశేషాలు ప్రతిరోజూ బోలెడన్నీ చూసేస్తున్నాం. అయితే చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా 2019లో బాగా పాపులర్ అయ్యింది. బైట్ డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్ టాక్ 2019లో వీక్షకుల మెప్పు పొందడంలో అందరి కంటే ముందు నిలిచింది.

TikTok

ఈ ఏడాది కొన్ని వందల, వేల సంఖ్యలో వైరల్ వీడియోలను వీక్షకుల కోసం పోస్ట్ చేసింది. వాటి చూసిన యూజర్లు ఎంతో ఇష్టపడి వాటిని చాలా మందితో షేర్ చేసుకున్నారు. అలా అత్యంత వైరల్ అయిన టిక్ టాక్ వీడియోలలో టాప్ -10 లీస్టును మీ కోసం తీసుకొచ్చాము. ఈ వీడియోలు చూస్తే కచ్చితంగా మీరు వావ్ అంటారు. ఇంకా ఎందుకు ఆలస్యం ఆ వీడియోలను పూర్తిగా చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి...

10) బేర్ సూట్ డేర్ డెవిల్..

టెడ్డి బేర్ దుస్తులలో ఒక వ్యక్తి మెట్ల మీద నుండి జారిపడటం.. బైక్ పై రయ్యని దూసుకెళ్లే ఈ వీడియో అత్యంత వైరల్ అయిన టిక్ టాక్ వీడియోలో టాప్-10 ప్లేస్ ను కన్ఫార్మ్ చేసుకుంది.

9) షేవింగ్ క్రీమ్ + క్రోక్స్..

ఇక్కడ ఏమి జరుగుతుందో.. ఎందుకు జరుగుతుందో మేం చెప్పడం కంటే.. మీరు చూస్తే బెటర్..

8) ఆరోగ్యకరమైన హమ్మింగ్ బర్డ్

చిన్న హమ్మింగ్ బర్డ్ ఓ వ్యక్తి చేతిలో ఎంతో దర్జాగా ఓ ఆకును తింటూ ఉంటుంది. ఈ వీడియోను 1.5 మిలియన్ల మంది లైక్ చేశారు.

7) నిజాయితీ అభిప్రాయం..

కొంబుచా అమ్మాయి తన నిజాయితీ గల అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా తెలుపుతుంది. కూల్ డ్రింక్ తాగి ఆమె ఇచ్చే హావాభావాలను మీరు అస్సలు మిస్సవ్వకండి. మీరందరూ తప్పక చూడవలసిన వీడియో ఇది. టాప్-7లో నిలిచింది.

6) పిల్లి లొల్లి..

ఈ వీడియోలో పిల్లి లొల్లిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో అత్యంత వైరల్ అయిన వీడియోలో ఆరో స్థానంలో నిలిచింది. దీనికని 2.2 మిలియన్ల మంది లైక్ చేశారు.

5) ఎంఫింగ్ టీ..

టిక్ టాక్ స్టార్ సమ్మీ లూయిస్ తన వైరల్ వీడియోలో ఈ ఏడాది 2019లో ఐదవ స్థానాన్ని సంపాదించింది.

(నిరాకరణ : వీక్షకుల అభీష్టానుసారం సలహా. ఈ వీడియోలో పిల్లలు వినకూడని పదాలతో ఉంది. ఈ వీడియో ఐదో స్థానంలో నిలిచింది.

4) మ్యాన్ వర్స్ వైల్డ్

ఈ వీడియోలో బొద్దింకను చంపేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుంది. అయితే అకస్మాత్తుగా బొద్దింగ ఎగరడంతో ఆమె భయపడిపో ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియోను మీరే చూడండి

3) పేలుతున్న స్విమ్మింగ్ పూల్..

ఈ వీడియోలో స్విమ్మంగ్ పూల్ పేలుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందులో మంచి ట్విస్ట్ ఉంటుంది. అదేంటో మీరే చూడండి. ఈ వీడియోను 7 మిలియన్లకు పైగా లైక్ చేశారు. దీనికి వేలాది మంది మంచి కామెంట్లు చేశారు.

2) అరటిపండుకు ఆపరేషన్

ఈ వీడియోలో మరీ వింతగా అరటి పండుకు అపరేషన్ చేస్తున్నట్లు ఉంటుంది. అరటిపండుకు ఆపరేషన్ చేస్తున్నట్లు ఈ వీడియో తీశారు. ఈ అరటి పండు లోపల మరో అరటి పండును చాలా జాగ్రత్తగా తీస్తారు. ఆది మేమం చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. చాలా ఫన్నీగా ఉండే ఈ వీడియో టిక్ టాక్ 2019లో టాప్-2 ప్లేసును దక్కించుకుంది.

1) క్రేజీ ఎలిఫెంట్ టూత్ పేస్ట్..

2019 సంవత్సరంలో డేవిడ్ డోబ్రిక్ మరియు నిక్ ఉహాస్ యొక్క క్రేజీ టూత్ పేస్టును టాపర్ స్థానంలో నిలిచింది. 2019లో అత్యంత వైరల్ అయిన టిక్ టాక్ వీడియోగా తొలి స్థానంలో నిలిచింది. ఈ వీడియోను 17.5 మిలియన్ల మంది లైక్ చేశారు. ఈ వీడియో ఏనుగు టూత్ పేస్ట్ ప్రయోగాన్ని భారీ స్థాయిలో చేస్తున్నట్లు చూపిస్తుంది.

English summary

Top 10 Viral Videos of TikTok in 2019

Here are the Top 10 Viral Videos of TikTok in 2019. Take a look
Desktop Bottom Promotion