For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబ్ డ్రైవర్ గా ట్రాన్స్ జెండర్ వండర్స్ క్రియేట్ చేస్తోంది. ప్రతి బుకింగ్ కూ 5 స్టార్ పొందుతోంది

|

ఇంతవరకు మనం ఒక ట్రాన్స్ జెండర్ న్యూస్ యాంకర్ అవ్వడం చూశాం.. మన దేశంలో ఒక ట్రాన్స్ జెండర్ తమిళనాడులో తొలిసారిగా సబ్ ఇన్ స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన విషయం గురించి విన్నాం.. కానీ ప్రస్తుతం మేము చెప్పబోయే ట్రాన్స్ జెండర్ గురించి వింటే మీరు కచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఆమె ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప్రవేశించిన ట్రాన్స్ జెండర్. క్యాబ్ డ్రైవర్ గా మారి ప్రతి బుకింగ్ లోనూ 5 స్టార్ సాధిస్తోంది. అందరికీ షాకిస్తోంది. ఇంతకీ ఆ ట్రాన్స్ జెండర్ ఎవరు.. ఆమె ఎందుకు క్యాబ్ డ్రైవింగ్ నే వృత్తిగా ఎంచుకున్నారు. ప్రతి బుకింగ్ కూ 5 స్టార్ ఎలా సాధిస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ట్రాన్స్ జెండర్ (హిజ్రా) అంటే ప్రస్తుత సమాజంలో అందరికీ చిన్నచూపే. ఎందుకంటే వారు కూడా మనలాగే మనుషులని, వారు కూడా మనలా బతకాలని అనుకున్నా ఈ సమాజం వారికి అలాంటి అవకాశాలు ఇవ్వదు. పైగా వారిని హీనంగా చూస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా వారిని అణగదొక్కాలనుకుంటుంది. పదే పదే వారిని అవమానిస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో అడ్డంకులను అధిగమించింది ఆ ట్రాన్స్ జెండర్. క్యాబ్ డ్రైవర్ గా 5 స్టార్ సాధించిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ట్రాన్స్ జెండర్ ఎవరంటే రాణి కిన్నారా.

ఒడిశా రాజధాని భువనేశ్వర్ నివసించే రాణి కిన్నా క్యాబ్ డ్రైవర్ గా వృత్తిగా ప్రారంభించిన ఆమె ఆ నగరంలో అందరికీ ఇష్టమైన డ్రైవర్ గా మారిపోయింది. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ (బహుళ జాతి రవాణా సంస్థ) ఉబర్ తరపున 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డు నెలకొల్పింది. అయితే ఆమెకు ఈ విజయం ఊరికే దక్కలేదు. దీనికి వెనుక ఆ ట్రాన్స్ జెండర్ కఠోర శ్రమ ఉంది.

డ్రైవింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లో అంటే తన కెరీర్ ప్రారంభంలో తనకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. తనను డ్రైవర్ గా సమాజం అంగీకరించలేదు. కనీసం తనకు మద్దతు కూడా రాలేదు. దీంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందింది. అప్పుడే పూరిలోని పవిత్ర రథయాత్ర సందర్భంగా అంబులెన్సు కోసం డ్రైవర్ గా స్వచ్ఛందంగా పని చేయాలని నిర్ణయించుకుంది.

ఇది చూసిన ఓ మాజీ ఉబర్ ఉద్యోగి రాణిని క్యాబ్ డ్రైవింగ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అలా ఆ ట్రాన్స్ జెండర్ డ్రైవర్గా ప్రోత్సహించారు. 2016లో డ్రైవింగ్ మొదలు పెట్టింది. 2017లో అంబులెన్స్ డ్రైవర్ గా మారింది. ఆ తర్వాత ఉబర్ లో చేరి తిరుగులేని విజయం సాధించింది. అంతేకాదండోయ్ ప్రస్తుతం ఆమె ఒక సొంత కారును కూడా కొనుగోలు చేసింది. దీంతో హిజ్రాల సంఘం నుండి ఎక్కువ మంది సగర్వంగా తల ఎత్తుకుని స్వయం ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారందరికీ ఈ ట్రాన్స్ జెండర్ రాణి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరి కొంత మంది రాణికి అభిమానులు, అనుచరులుగా మారిపోయారు. వారంతా తాము కూడా డ్రైవర్ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. ''ముఖ్యంగా మహిళలకు ప్రమాదకరమని అనిపించే మగ డ్రైవర్లతో పోల్చితే తమతో ప్రయాణించేటప్పుడు చాలా సురక్షితంగా ఉంటారు'' అని ఆ సంఘానికి చెందిన మరో ట్రాన్స్ జెండర్ చెప్పారు.

English summary

Transgender Rani Kinnar becomes India's first five-star-rated cab driver

Transgender (hijra) means little to everyone in today's society. Because they are just like us and this society does not give them such opportunities even if they think they should. Looks bad on them. They want to undermine them socially and economically. Repeatedly insults them. But it is the transgender that has overcome many obstacles. She became the first transgender to achieve 5 star status as a cab driver. The Queen is the transgender.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more