Latest Updates
-
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు!
Ugadi 2023: ఉగాది యొక్క జ్యోతిష్య, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
ఉగాది పండగకు జ్యోతిష్యపరంగా, ఆధ్యాత్మికపరంగా, చారిత్రక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరం. ప్రతి ఏటా ఛైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఏటా ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2023లో మార్చి 22వ తేదీన ఉగాది వస్తోంది.

ఉగాది పండగకు జ్యోతిష్యపరంగా, ఆధ్యాత్మికపరంగా, చారిత్రక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
ఈ ఉగాదికి శుభకృతు నామ సంవత్సరానికి ముగింపు పలికి శోభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఈ అనంతమైన లోకాన్ని ఉగాది రోజున అంటే ఛైత్రమాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి రోజున సృష్టించాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
ఈ పవిత్రమైన రోజు నుండే భూలోకం ప్రారంభమైందని శాస్త్రాలలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
ఛైత్ర మాసంలో శుక్ల పక్షం రోజున పాడ్యమి రోజున వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజున కొత్త జీవితానికి నాందిగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం.. వేదాలను హరించిన సోమకుడిని శ్రీ విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి తనను సంహరిస్తాడు. అదే సమయంలో వేదాలను బ్రహ్మదేవుడికి అప్పజెబుతాడు. ఈ సందర్భంగా ఉగాది పండుగను జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
2. ఖగోళ ప్రాముఖ్యత:
ఉత్తరార్థగోళంలో 21 రోజుల పాటు సూర్యుడి నుండి నిరంతరం కాంతి వస్తుంది కాబట్టి కొత్త ఖగోళ చక్రం ఉగాది రోజున ప్రారంభమవుతుందని చాంద్రమాన క్యాలెండర్ చెబుతోంది. భూమి సూర్యుని చుట్టూ ఒక పూర్తి పరిభ్రమణం పూర్తి చేసే రోజు ఉగాది.
తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఉగాది కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఉగాది లేదా గుడి పడ్వాగా పిలుస్తారు.
3. సహజ ప్రాముఖ్యత:
వసంత రుతువులో వచ్చే ఉగాది కోసం ప్రకృతి తన వాడిపోయిన ఆకులను వదిలేస్తుంది. కొత్త ఆకులు చిగురిస్తాయి. ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది.
ప్రకృతి సతత హరితాలు చూడముచ్చటగా ఉంటుంది. చైత్ర నవరాత్రుల్లో మొదటి రోజు కావడం వల్ల ఈ రోజున వసంత నవరాత్రిగా కూడా జరుపుకుంటారు.
4. చారిత్రక ప్రాముఖ్యత:
శాలివాహనుడు పట్టాభిషేకం జరిగిన రోజుకు గుర్తుకుగా ఉగాదిని జరుపుకుంటామని ఓ కథ ప్రచారంలో ఉంది. ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఆరంభమైనదని అర్థం వస్తుంది.
ఉగాదిని యుగాది అని కూడా అంటారు. యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం. ఆ యుగానికి ఆది యుగాదిగా వచ్చింది.
ఉగాదిని ఏ రాష్ట్రంలో ఏమని పిలుస్తారంటే..:
- తెలుగు వారు : ఉగాది
- మరాఠీలు : గుడి పడ్వా
- తమిళులు : పుత్తాండు
- మలయాళీలు : విషు
- సిక్కులు : వైశాఖీ
- బెంగాళీలు : పోయ్ లా బైశాఖ్
ఉగాది పచ్చడి రుచులు, వాటి అర్థాలు:
- బెల్లం తియ్యదనానికి.. సంతోషానికి ప్రతీకగా భావిస్తారు.
- వేప పువ్వు చేదుతనానికి అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తుంది.
- పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది.
- ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు.
- పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది.
- కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది.



Click it and Unblock the Notifications