Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
శ్రీ ఫ్లవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా కన్య రాశి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చూస్తుండగానే హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో ఫ్లవ నామ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అప్పుడే ఉగాది పండుగ కూడా వెళ్లిపోయింది. త్వరలో శ్రీరామ నవమి పండుగను కూడా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో కన్య రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..
కన్య రాశి వారికి ఏప్రిల్ నెలలో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. మూడో వారంలో మీరు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలొస్తాయి. చివరి వారంలో అంతా సాధారణంగా ఉంటుంది.

మే..
ఈ నెలలో కన్య రాశి వారికి చాలా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ ఆదాయం క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అయితే మీరు ఒత్తిడిని అధిగమించి పనులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీరు ఈ నెలలో పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయగలరు.

జూన్..
ఈ నెలలో ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మీరు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. రెండో వారం మరియు మూడో వారంలో మీకు ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మీ జీవన ప్రమాణం పెరుగును. మీకు స్థిరమైన జీవనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి తోడ్పాటు వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

జులై..
ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని సానుకూల ఫలితాలే వస్తాయి. వ్యాపారులు ఆశించిన విధంగా ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కొన్ని బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలున్నాయి.

ఆగస్టు..
ఈ రాశి వారు ఈ నెలలో అనుకున్న సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. ఆదాయ పరంగా ఈ మాసంలో మంచిగా ఉంటుంది. మరోవైపు మీరు ఎవరినైతే వ్యక్తులను నమ్ముతారో.. వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సొంతంగా ఆలోచించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది.

సెప్టెంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కొన్ని అడ్డంకులు వస్తాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అకస్మాత్తు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ నెల చివర్లో సామాన్యంగా ఉండును. మీరు ఈ నెలలో చివరి సోమవారం నాడు ఈశ్వరునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుంది.

అక్టోబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మరోవైపు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారికి ప్రతికూల ఫలితం రావొచ్చు. అయితే మీరు నిరంతరం కష్టపడితే మీకు సానుకూల ఫలితం వస్తుంది.

నవంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు చాలా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు రుణ బాధలు తొలగి మానసికంగా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు కొన్ని విషయాల గురించి అనుమానాలు ఏర్పడతాయి. ఈ నెల చివర్లో మీకు విపరీతమైన ప్రయోజనాలు దక్కుతాయి.

డిసెంబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య పరంగా అంతా మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలను పొందుతారు. మరోవైపు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పనులన్నీ నెమ్మదిగా సాగుతాయి. మీరు ఆర్థిక పరంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జనవరి..
ఈ రాశి వారికి ఈ నెలలో ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీరు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రలేమి, అకస్మాత్తుగా ఆకలి వేయడం వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు శ్రమతో కూడిన పనులు తగ్గించుకోవడం మంచిది. ఈ నెలలో మీరు చేసే ప్రయాణం వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది.

ఫిబ్రవరి..
ఈ నెలలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేయడం వల్ల విజయం లభిస్తుంది. వివాహ సంబంధ విషయాల వల్ల మీరు విజయం సాధిస్తారు. మీరు చేసే పనుల్లో మీరు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మీకు చివరి వారంలో శ్రమ అధికంగా ఉంటుంది. మీ మధ్య వాతావరనం ప్రతికూలంగా ఉంటుంది.

మార్చి..
హిందూ క్యాలెండర్ ప్రకారం, చివరి నెల అయిన మార్చి మాసంలో కన్య రాశి వారికి ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. స్త్రీలకు ప్రెగ్నెన్సీ లేదా ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మీకు రావాల్సిన ఆదాయం సకాలంలో లభించదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ సంతాన ప్రయత్నాలు భగవంతుని ఆశీర్వాదంతో సఫలం కావొచ్చు. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications