Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Ugadi Rashi Phalalu 2021: ఫ్లవ నామ సంవత్సరంలో తుల రాశి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
శ్రీ ఫ్లవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా తుల రాశి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చూస్తుండగానే హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో ఫ్లవ నామ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అప్పుడే ఉగాది పండుగ కూడా వెళ్లిపోయింది. త్వరలో శ్రీరామ నవమి పండుగను కూడా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో తుల రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఏప్రిల్..
ఈ నెలలో తుల రాశి వారికి ఆదాయ పరంగా మంచిగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులకు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. కొత్త వాహనం, వస్త్రాలు, భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

మే..
ఈ నెలలో తుల రాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అవసరానికి స్నేహితులకు డబ్బు అడగొచ్చు. మీకు ఆదాయ విషయంలో ఆకస్మిక సమస్యలు పెరుగుతాయి. మీకు ఇంటా బయటా చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ కాలంలో నైపుణ్యాలు పెంచుకోవాలి. మరోవైపు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

జూన్..
ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మీకు గతంలో కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మరోవైపు ఆదాయ పరంగా కొన్ని సమస్యలు తీరతాయి. మీరు ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకొంటారు. ఈ నెలలో ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి.

జులై..
ఈ నెలలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు మానసిక ఆందోళనల నుండి కూడా బయటపడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు. వ్యాపారులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు.

ఆగస్టు..
ఈ నెలలో తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఆశించిన విధంగా ఆదాయం పొందుతారు. కుటుంబంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు రెండో వారంలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ కాలంలో చాలా మంచిగా ఉంటుంది. మహిళలకు కొత్త బాధ్యతల వల్ల ఆందోళన పెరుగుతుంది.

సెప్టెంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో సమస్యలు పెరుగుతాయి. మీరు కొత్త వాహనాలు కొనుగోలు చేసేటట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సమేతంగా ప్రయాణం చేయాలనుకుంటే, వాటిని వాయిదా వేయడం మంచిది. ఆదాయ పరంగా అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయ పరంగా మంచిగా ఉంటుంది. మీరు ఇతరుల సహకారం వల్ల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ జీవిత భాగస్వామి సంబంధిత విషయాల్లో చక్కటి సుఖం ఏర్పడుతుంది. పెళ్లి కానీ వారికి, మంచి వివాహ సంబంధాలు కూడా రావొచ్చు. పని విషయంలో ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు కలసి రావు.

నవంబర్..
ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం నుండి ఆదాయ పరంగా మంచిగా ఉంటుంది. మీరు భాగస్వామితో సన్నిహితంగా గడుపుతారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల ఆదరణతో పనులన్నీ సులభంగా పూర్తి చేయగలరు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.

డిసెంబర్..
ఈ నెలలో తుల రాశి వారి ఉద్యోగులకు బదిలీ కావొచ్చు. అయితే మీరు ఆదాయ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొందరు జంటలకు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రెండో వారంలో విలువైన సమాచారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

జనవరి..
ఈ రాశి వారికి జనవరి మాసం ప్రతికూలంగా ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా మానసిక సమస్యలు పెరుగుతాయి. దీంతో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది.

ఫిబ్రవరి..
ఈ రాశి వారికి ఈ నెలలో మంచిగా ఉంటుంది. మీకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల ఉండొచ్చు. కొందరికి బదిలీ కూడా కావొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది.

మార్చి..
ఈ రాశి వారికి ఈ నెలలో మంచిగా ఉంటుంది. మీకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీకు ఆదాయ అవసరాలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగులు పదోన్నతి లేదా వేతనంలో పెరుగుదల ఉంటుంది. దంపతులకు కొన్ని సంతాన సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ కాలం మంచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
