Ugadi Rasi Phalalu 2022:‘శుభ కృత’ఏడాదిలో మీ జాతకం తెలుసుకోండి.. మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి...

2022లో శుభకృత నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం.

'ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున ప్రపంచంలోని తెలుగు వారందరికీ 'శుభకృత' నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు''. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 02వ తేదీన శనివారం నుండి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

Ugadi Rashi Phalalu 2022, Shubha Kruta Nama Samvatsara Ugadi Horoscope Predictions 2022-23 in Telugu

ఈ పండుగ సమయంలో తెలుగు ప్రజలతో పాటు మరికొందరు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. వీటిలో షడ్రుచులను కచ్చితంగా చేరుస్తారు. ఇదిలా ఉండగా.. ఉగాది అంటేనే సంవత్సరం యొక్క ప్రారంభ రోజు కావున ఈ పవిత్రమైన రోజున చాలా మంది జ్యోతిష్యపండితులు పంచాంగ శ్రవణం చేస్తారు.

Ugadi Rashi Phalalu 2022, Shubha Kruta Nama Samvatsara Ugadi Horoscope Predictions 2022-23 in Telugu

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Ugadi Rashi Phalalu 2022, Shubha Kruta Nama Samvatsara Ugadi Horoscope Predictions 2022-23 in Telugu

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ఎవరెవరికి ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-14, వ్యయం-14 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-3, అవమానం-06 గా ఉంటుంది. మేష రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గురు గ్రహం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు అనవసరంగా దూర ప్రయాణాలు చేయొచ్చు. ఎక్కుల ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. మరోవైపు శని గ్రహం అనుగ్రహం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త ఇంట్లోకి అడుగులు పెట్టొచ్చు. రాహు గ్రహం ప్రభావం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే కేతు గ్రహం వల్ల మాత్రం కొన్ని సమస్యలు ఏర్పడొచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-08, వ్యయం-08 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-06, అవమానం-06 గా ఉంటుంది. గురు గ్రహం కారణంగా వీరికి శుభ ఫలితాలు వస్తాయి. మరోవైపు శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు రావొచ్చు. రాహూ గ్రహం ప్రభావం వల్ల చెడు ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కేతువు వల్ల మాత్రం మంచి ఫలితాలు రావొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-11, వ్యయం-05 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-02, అవమానం-02 గా ఉంటుంది. గురు గ్రహం వల్ల ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి. శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. రాహు గ్రహం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కేతువు వల్ల సానుకూల ఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-05, వ్యయం-05 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-09, అవమానం-02 గా ఉంటుంది. గురు గ్రహ అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. శని గ్రహం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. రాహు గ్రహం వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు వస్తాయి. కేతువు గ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-08, వ్యయం-14 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-01, అవమానం-09 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం ప్రతికూలంగా ఉండటం వల్ల మీకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. శని గ్రహం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాహువు ప్రభావం కారణంగా, ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలొస్తాయి. కేతువు ప్రభావంతో సమస్యలు తొలగిపోతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-11, వ్యయం-05 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-4, అవమానం-09 గా ఉంటుంది. గురు గ్రహం వల్ల ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలొస్తాయి. రాహువు వల్ల కూడా ప్రతికూల ఫలితాలొస్తాయి. కేతువు వల్ల చెడు ఫలితాలు రావొచ్చు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-08, వ్యయం-08 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-07, అవమానం-09 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది విజయాలు లభిస్తాయి. శని గ్రహం అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో శుభ ఫలితాలొస్తాయి. రాహు, కేతు గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు రావొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-14, వ్యయం-14 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-03, అవమానం-01 గా ఉంటుంది. గురు గ్రహం అనుకూలంగా ఉండటం ఈ రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలొస్తాయి. వివాహితులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. శని గ్రహం ప్రభావం వల్ల మానసిక ధైర్యం కొద్దిగా తగ్గుతుంది. రాహువు గ్రహం కారణంగా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కేతువు గ్రహం వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా.. చివరికొచ్చేసరికి విజయవంతంగా పూర్తవుతాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-02, వ్యయం-08 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-06, అవమానం-01 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం వల్ల ఈ ఏడాదిలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. దీంతో మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. శని గ్రహం ప్రభావం కారణంగా, ప్రతికూల ఫలితాలు రావొచ్చు. రాహువు కారణంగా ఆర్థిక పరంగా చెడు ఫలితాలొస్తాయి. కేతువు గ్రహం వల్ల మాత్రం ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-09, వ్యయం-02 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-02, అవమానం-04 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం వల్ల ఈ ఏడాది ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు రావొచ్చు. శని గ్రహం ప్రతికూల ప్రభావంతో చిన్నారులకు అనారోగ్య సమస్యలు రావొచ్చు. రాహువు వల్ల పెద్ద వయసు వారికి మతిమరుపు సమస్యలు పెరుగుతాయి. కేతుగ్రహంతో మాత్రం శుభ ఫలితాలొస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-09, వ్యయం-02 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-09, అవమానం-04 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావంతో ఈ ఏడాది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు విజయం లభిస్తుంది. శని గ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహువు ప్రభావంతో కొన్ని సందర్భాల్లో కోపంగా ఉండొచ్చు. కేతువు ప్రభావం వల్ల ఆర్థిక పరంగా లాభాలొస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-02, వ్యయం-08 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-01, అవమానం-07 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం వల్ల, మీరు అత్యంత యోగ్యమైన జీవన మార్గాన్ని పొందొచ్చు. శని గ్రహం ప్రభావంతో ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. రాహువు ప్రభావంతో వ్యాపారులకు లాభాలొస్తాయి. కేతువు వల్ల మాత్రం కొన్ని సమస్యలు ఏర్పడతాయి..

FAQs
BoldSky Lifestyle

Desktop Bottom Promotion