For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్ర సంచారం వల్ల ఈ 2 రాశుల వారికి కష్టంగా ఉంటుంది... మీ రాశి ఉందేమో చూడండి...!

శుక్ర గ్రహం గమనం ద్వాదశ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆనందానికి, ఆహ్లాదానికి, సంతోషాలకు, ప్రేమానురాగాలకు సంకేతంగా చెప్పుకునే శుక్రుడు ఈ నెలలోనే అంటే 28వ తేదీన తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి మధ్యాహ్నం 15:36 సంచరించబోతున్నాడు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు ఇలా సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

Venus Retrograde in Gemini June 2020: Effect on each zodiac sign

అయితే వృషభరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు చాలా సౌకర్యవంతమైన, సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే ఇందుకోసం వీరి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Venus Retrograde in Gemini June 2020: Effect on each zodiac sign

ఈ సందర్భంగా మిగిలిన రాశుల వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందాలంటే కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండివిదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి విశేష ఫలితాలు ఉంటాయి. ఈ సంచారం ఫలితంగా మీ మాట తీరులో చాతుర్యం పెరుగుతుంది. ఇది ఇతరులను మంత్రముగ్దులను చేస్తుంది. మీరు ఈ సమయంలో కొత్త వస్తువులు, ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : మీరు శుక్రవారం శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ సంచారం సమయంలో మీ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మీకు ఎక్కువగా సానుకూల ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇదివరకు మీ ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలుంటే, అవన్నీ తొలగిపోతాయి. అయితే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : ఒపెల్ జాతిరత్నం ధరిస్తే మంచి జరుగుతుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి అకస్మికంగా విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల మీకు ఆర్థిక కష్టాలు ప్రారంభమవుతాయి. అయితే మీ యొక్క రాబడి కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఖర్చులను తట్టుకుని నిలబడగలరు. విద్యార్థులకు విజయం లభిస్తుంది.

పరిహారం : ప్రతిరోజూ ఆవుకు మీరు గడ్డిని ఆహారంగా వేయాలి.

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ యొక్క రాబడి మెరుగుపడుతుంది. వ్యాపారులు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు మెరుగవుతాయి. మొత్తంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు.

పరిహారం : శ్రీ సూక్తం శుక్రవారం రోజు పఠిస్తే మంచిది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీ పని తీరు వల్ల మీకు సమాజంలో మంచి గౌరవం మరియు గుర్తింపు లభిస్తుంది. అయితే మీరు గాసిప్ లకు వివాదాలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. మీ తోబుట్టువులు సహాయసహకారాలు అందిస్తారు.

పరిహారం : మీరు మహాలక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని అద్భుత ఫలితాలను పొందుతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు శుక్ర సంచారం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. మీ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొనే అవకాశం ఉంది. మీ ప్రయాణాలలో మీరు కొత్త స్నేహితులను కలుసుకుంటారు.

పరిహారం : ఆరుముఖముల రుద్రాక్షను ధరిస్తే, మీరు మరిన్ని సానుకూల ఫలితాలను పొందుతారు.

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

తుల రాశి..

తుల రాశి..

శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. మీరు విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ పనులలో కూడా సానుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది.

పరిహారం : ‘ఓం శుం శుక్రాయ నమః' అనే శుక్రబీజ మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

వృషభ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ యొక్క బంధంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయే అవకాశముంటుంది. వ్యాపారులకు అత్యంత అనుకూల సమయంగా చెప్పొచ్చు. మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీరు మరిన్ని మంచి ఫలితాలను పొందేందుకు, ప్రతిరోజూ కుభేర మంత్రాన్ని పఠించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీ రాబడి కూడా తగ్గిపోతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. మీకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. మీ ప్రత్యర్థులు కూడా మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలను పొందుతారు.

పరిహారం : శుక్రవారం పంచదార మరియు బియ్యం దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు కూడా మెరుగవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో మీరు మంచి మార్గంలో పయనిస్తారు. ఉద్యోగులు కూడా మంచి ఫలితాలను అనుభవిస్తారు. వ్యాపారులకు అత్యంత అనుకూల సమయంగా చెప్పొచ్చు.

పరిహారం : మంచి నాణ్యత కలిగిన రోపాల్ రాయిని ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో కూడా ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. మీ పనిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలే వస్తాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.

పరిహారం : మీరు ఆరుముఖముల రుద్రాక్షను ధరించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి. దీని వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. మీరు కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు.

పరిహారం :శుక్రవారం ఏదైనా గుడికి వెళ్లి అలంకరణకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి.

English summary

Venus Retrograde in Gemini June 2020: Effect on each zodiac sign

How Venus Retrograde June 28, 2020 Will Affect You, Based On Your Zodiac Sign.
Desktop Bottom Promotion