For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Aquarius: కుంభంలోకి శుక్రుడి సంచారం... 2 రాశుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!

కుంభ రాశిలోకి శుక్రుడి సంచారంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారంతా శుక్రుడు ఆనందం, సంతోషం, అందరి శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. గ్రహాలను బట్టి ఎవరి జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటుందో వారికి సంపద, ఆయురారోగ్యం లభిస్తుంది.

Venus Transit in Aquarius on 21 February 2021 Effects on Zodiac Signs in Telugu

అలాంటి శుక్రుడు 2021లో ఫిబ్రవరి 21వ తేదీన మధ్యాహ్నం 2:19 గంటలకు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో శుక్రుడు సుమారు నెల రోజుల పాటు నివాసముండనున్నాడు. ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Venus Transit in Aquarius on 21 February 2021 Effects on Zodiac Signs in Telugu

అయితే ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అనేది పడుతుంది. శుక్రుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల ప్రతికూలంగా ఉంటుంది.. శుక్రుడి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏఏ రాశుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరు..అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి..ఏఏ రాశుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలరు..అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి..

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మేషరాశి వారు ప్రారంభించే పనులలో విజయం లభిస్తుంది. మీ కుటుంబం యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మరోవైపు వివాహితులకు తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

పరిహారం : శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితాలొస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు మానసికంగా మరియు శారీరక సమస్యలతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. అయితే మీరు మంచి ఫలితాలను పొందాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే.. ఉన్నత ర్యాంకును పొందొచ్చు.

పరిహారం : శుక్రుని రవాణా సమయంలో ఉదయాన్నే గులాబీ నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ రంగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఈ కాలంలో మీకు చాలా విషయాల్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

పరిహారం : శుక్రుని సంచారం సమయంలో కాత్యాయని దేవిని పూజించాలి.

మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఒడిదుడుకులైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీకు రావాల్సిన బకాయిలను ఈ కాలంలో పొందుతారు. ఉద్యోగులకు మాత్రం సహోద్యోగులతో వివాదం ఉండొచ్చు. ఈ సమయంలో మీరు ఆనందకరమైన విషయాలకు డబ్బులను ఖర్చు చేయొచ్చు.

పరిహారం : శుక్రవారం రోజు మహాలక్ష్మీ అమ్మవారికి ఏవైనా వస్తువులను దానం చేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చేసిన పనికి తగిన ఫలితం రాకపోవడంతో మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఈ సమయంలో వివాహితులకు చాలా మంచిగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వారికి కూడా వివాహ ప్రతిపాదన రావొచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : శుక్రుడి సంచారం సమయంలో ‘ఓం శుం శుక్రాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రేమ జీవితంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. అయితే మీరు ఓపికగా ఉండాలి. ఈ సమయంలో మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.

పరిహారం : శుక్రవారం రోజున మెడలో క్రిస్టల్ క్వార్ట్జ్ రోజరీని ధరించాలి.

తుల రాశి..

తుల రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మంచిగా ఉంటుంది. వివాహితులకు పిల్లల నుండి ఓ శుభవార్త వినిపిస్తుంది. సమాజంలో మీ తల్లి గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కూడా మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు.

పరిహారం : శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు ధరించాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీకు మంచిగా ఉంటుంది. మీకు ఇంటి సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ తల్లితో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు వారి నుండి మంచి ప్రయోజనం పొందొచ్చు. ఈ కాలంలో మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.

పరిహారం : శుక్రుడి రవాణా సమయంలో పరశురాముని కథను చదవండి లేదా వినండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఫీల్డ్ లో మంచి ప్రదర్శనను కొనసాగిస్తారు. ఉద్యోగులు సీనియర్లతో పాటు సహోద్యోగులతో మంచి సంబంధాలు పెంచుకోవాలి. మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది.

పరిహారం : శుక్రుని అనుగ్రహం కోసం శుక్రవారం రోజున చక్కెర దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలను కూడా పొందుతారు. మీరు కొత్త బట్టలు లేదా ఆభరణాల కోసం షాపింగ్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థులు పరీక్షలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు మీ క్రుషిని ఇలాగే కొనసాగించాలి.

పరిహారం : శుక్రవారం రోజున నాణ్యత గల తెల్లని రత్నం ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఫిబ్రవరి 21వ తేదీన శుక్రుడు మకరం నుండి ఈ రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మీ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆదాయ పరంగా బాగుంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో అంతా మంచిగా ఉంటుంది.

పరిహారం : గోమాతకు ఏదైనా ఆహారం ఇస్తే శుక్రడి అనుగ్రహం లభిస్తుంది.

మీన రాశి..

మీన రాశి..

శుక్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా పెరగొచ్చు. అయితే మీరు సౌకర్యవంతమైన వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. కానీ మీ బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ కాలంలో మీరు చేసే పనులను చాలా జాగ్రత్తగా చేయాలి.

పరిహారం : సోమ మరియు శుక్రవారాల్లో పాలను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

English summary

Venus Transit in Aquarius on 21 February 2021 Effects on Zodiac Signs in Telugu

Venus Transit in Aquarius Effects on Zodiac Signs in Telugu.The Venus Transit in Aquarius will take place on 21 February 2021. Learn about remedies to perform in Telugu.
Desktop Bottom Promotion