Latest Updates
-
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి
Venus Transit in Aries:మేషంలోకి శుక్రుని రవాణాతో ఈ రాశులకు సంపద పెరుగుతుందట...!
2022లో మే 23న శుక్రుడు మేషంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానంలో మార్పులు, నక్షత్రాల పరివర్తనం వల్ల రాశి ఫలితాలు మారుతూ ఉంటాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు.

జ్యోతిష్యం ప్రకారం, నవ గ్రహాలలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శుక్రుడు ప్రేమ జీవితానికి, విలాసవంతానికి, భౌతిక సుఖాలకు కారకంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శుక్రుని స్థానం అనుకూలంగా ఉంటుందో వారి వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.

ఈ నేపథ్యంలోనే శుక్రుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో మే 23వ తేదీన అంటే సోమవారం నాడు ఉదయం 8:39 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 18 జూన్ 2022 వరకు ఉదయం 8:28 గంటలకు నివాసం ఉండి అనంతరం వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి మహర్దశ పట్టనుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఇంతకీ ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
శుక్రుడు ఇదే రాశిలోకి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో బలంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో మీ ఖర్చులు కూడా తగ్గడంతో డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిధున రాశి..
మేష రాశిలోకి శుక్రుడి రవాణా సమయంలో, ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. అయితే వ్యాపారులు ఈ కాలంలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితిలో ఉంటుంది. ఈ కాలంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి, మీరు ఏవైనా కొత్త పనులు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటిని లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు కూడా సాధ్యమైనంత తగ్గించుకోవాలి.

వృశ్చిక రాశి..
శుక్రుడు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేసే సమయంలో, ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు అనేవే ఉండవు. వ్యాపారులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. డబ్బు పరంగా మీకు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ, మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ ఆదాయం పెరుగుతుంది. మరోవైపు ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే బలమైన అవకాశం ఉంది.

ధనస్సు రాశి..
శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలొస్తాయి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడులకు కూడా ఈ కాలం అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్త వాహనాన్ని సైతం కొనుగోలు చేస్తారు. మీరు ఇతర వనరుల నుండి కూడా మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

కుంభ రాశి..
శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో, ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీరు ఊహించిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనాలు లేదా ఇంటిని కొనే అవకాశం ఉంది. మరోవైపు మీరు చేసే ఖర్చులు వీలైనంత మేరకు తగ్గించుకోవాలి.
శుక్రుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో మే 23వ తేదీన అంటే సోమవారం నాడు ఉదయం 8:39 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 18 జూన్ 2022 వరకు ఉదయం 8:28 గంటలకు నివాసం ఉండి అనంతరం వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు.ఈ సందర్భంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి..



Click it and Unblock the Notifications