Venus Transit in Scorpio On 02 October 2021:వృశ్చికంలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే…!

2021 అక్టోబర్ నెలలో వృశ్చికరాశిలోకి శుక్రుడి సంచారం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది భూమికి అతి దగ్గరగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ శుక్రుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు.

Venus Transit in Scorpio On 02 October 2021 Effects on Zodiac Signs in Telugu

ఎందుకంటే శుక్రుడు ఆనందం, సంతోషం, అందరి శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. అలాంటి శుక్రుడు అక్టోబర్ రెండో తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన తులరాశి నుండి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు.
Venus Transit in Scorpio On 02 October 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఏదో ఒక ప్రభావం అనేది ఉంటుంది. శుక్రుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. రాశుల ప్రతికూలంగా ఉంటుంది.. శుక్రుడి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..

మేషరాశి..

ఈ రాశి వారికి శుక్రుని రవాణా వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులకు, వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో మీ ప్రేమ వ్యవహారంలో కూడా సానుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో మంచి మార్పులను కూడా చూస్తారు. మీ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. మీడియా, ఫ్యాషన్ రంగాల్లో పని చేస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో విద్య, సంగీతం మరియు ప్రేమ సంబంధిత విషయాల్లో శుక్రుడు శుభ ఫలితాలను అందించబోతున్నాడు. ఈ కాలంలో మీరు అతి విశ్వాసాన్ని నివారించాలి. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీ కెరీర్ ని సీరియస్ గా తీసుకోవాలి. మీ ఉద్యోగంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కోరుకున్న మార్పు రావొచ్చు. మీకు మంచి అవకాశాలు కూడా దక్కుతాయి. మీరు విదేశీ ప్రయాణం కూడా చేయొచ్చు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీరు కష్టపడితే పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. వీరితో పాటు కళ, సాహిత్య రంగాల్లో ఉండే వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటే.. మీ కల నెరవేరొచ్చు. తల్లితో మీ సంబంధం నెరవేరొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు మూడో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీ ధైర్యం, కమ్యూనికేషన్ వంటివి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త పనులను సకాలంలో చేయగలరు. మతపరమైన కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీకు దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. మీరు పేదలకు దానం కూడా చేయవచ్చు. మీ ప్రేమ సంబంధాలలో మీరు విజయం సాధించొచ్చు. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి నిష్క్రమించనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. మీరు మీ మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీరు చాలా సుఖంగా, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

తుల రాశి నుండి ఈ రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టే సమయంలో ఈ రాశి వారికి ఫలితాలు ఆశించిన విధంగా వస్తాయి. ఈ కాలంలో అందం, కళ విషయాల్లో మీరు మంచి అనుభూతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీరు సరదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా అది దూరమవుతుంది. మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 12 వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కాబట్టి మీరు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. మరోవైపు మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే.. ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించొచ్చు. మీరు ఎందులో పెట్టుబడి పెడితే.. రెట్టింపు ఫలాలు రావచ్చు. చివరగా ఈ కాలంలో మీరు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఊహించిన ప్రయోజనాలన్నింటినీ పొందుతారు. అయితే ఈ కాలంలో మీరు విపరీతంగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ విషయంలో బ్యాలెన్స్ పాటించాలి. మీరు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు చాలా దూరంగా ఉండాలి. దీని వల్ల మీకు చాలా శుభకరంగా ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఇల్లు మరియు వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం శుభకరంగా ఉంటుంది. మీరు పురోగతి సాధించొచ్చు. మీకు కొన్ని కొత్త బాధ్యతలు పెరగొచ్చు. మరోవైపు మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే, మీరు మంచి అవకాశాలను పొందొచ్చు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు తొమ్మిదో పాదం గుండా సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ సౌకర్యాలన్నీ కూడా పెరుగుతాయి. మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీరు కళ మొదలైన వాటిలో మంచి ఫలితాలను పొందొచ్చు. అయితే మీరు వివాదాల వంటి వాటికి దూరంగా ఉండాలి. మరోవైపు మీరు రుణాలు తీసుకునే పరిస్థితిని నివారించాలి.


Story first published: Saturday, October 2, 2021, 9:00 [IST]
Desktop Bottom Promotion