Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
Venus Transit in Taurus on 04 May 2021:వృషభంలోకి శుక్రుడి రవాణా.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
2021లో మే 4వ తేదీ శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో 12 రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. మే ప్రారంభంలోనే వృషభరాశిలోకి బుధుడు ఆగమనం చేయగా.. తాజాగా శుక్రుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నెల మే 4వ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నం 1:09 గంటలకు మేషరాశి నుండి వృషభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు.

ఇదే రాశిలో మే 28వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. దీంతో ఒకే రాశిలో రెండు గ్రహాల సంయోగం జరగనుంది. దీని వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


మేష రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు నిష్క్రమించి, వృషభరాశిలోకి అడుగుపెట్టే సమయంలో మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు కొత్త సంబంధాలు వస్తాయి. ఉద్యోగులు ఆఫీసులో తెలివిగా వ్యవహరిస్తారు. అయితే మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు అనుభవం ఉన్న సలహాలను పాటించండి. మరోవైపు మీరు ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి..
శుక్రుడు మేష రాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశిలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. దీని వల్ల మీకు మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులను కొంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు స్నేహితులు పెరుగుతారు. మీ ప్రేమ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టిన పెట్టుబడుల్లో లాభాలను పొందుతారు. మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు కొత్త వాహనాలు కొనుగోలు చేయొచ్చు.

కన్య రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారు లాంగ్ జర్నీ చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. కాబట్టి మీ జర్నీని వాయిదా వేసుకోండి. మరోవైపు విద్యార్థులకు ఉన్నత విద్యకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ పురోగతికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు స్వగ్రామాలకు బదిలీ కావొచ్చు. కుటుంబంలో అంతా మంచిగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 8వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో తుల రాశి వారు ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీకు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబం ఆరోగ్యం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 7వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారులు ఈ సమయంలో ఓపికగా ఉండాలి. లేదంటే మీరు ఎవరితోనైనా గొడవ పడొచ్చు. దీని వల్ల మీకు నష్టం కలుగుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు సమస్యలు పెరుగుతాయి. సీనియర్లకు మంచి అవకాశాలు వస్తాయి. మీకు ఆదాయ పరంగా సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 5వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు చాలా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో అంతా మంచిగా ఉంటుంది. మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఆదాయ పరంగా అంతా మంచిగా ఉంటుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి.

మీన రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 3వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా చాలా లాభం రావొచ్చు. మీ బంధువులతో బంధం మరింత బలంగా మారుతుంది. కళా రంగంలో ఉండే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితుల కోసం ఖరీదైన వస్తువులు చేయొచ్చు. ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మరోవైపు వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయాలి.



Click it and Unblock the Notifications
