Latest Updates
-
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!
వైరల్ : ఈ ఫొటోకు క్యాప్షన్ చెబితే మహింద్రా స్కేల్ మోడల్ కారు గెలుచుకోవచ్చట...
కోతి కూర్చున్న చోటుకు సంబంధించి క్యాప్షన్ చెబితే మహీంద్ర మోడల్ కారు గెలుచుకోవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియా సూపర్ పవర్ గా ఎదుగుతోంది. అయితే దీన్ని ఎవరైతే మంచిగా వినియోగించుకుంటారో.. అలాంటి వారికి ఇది ఒక చక్కని ప్లాట్ ఫామ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

PC : Twitter
ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో సామాన్యులు సెలబ్రెటీలుగా మారారు.. మారుతున్నారు.. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే.. ఎవరైనా పాజిటివ్ కంటే నెగిటివ్ కే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా... అలాగే సోషల్ మీడియా అంటే చాలా మందిలో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటోంది.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండే ప్రముఖ బిజినెస్ మ్యాన్.. మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్టు బాగా వైరల్ అయిపోయింది. తను ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అలా చేస్తూ నెటిజన్లతో శభాష్ అనిపించుకుంటున్నాడు.

క్యాప్షన్ చెబితే కారు..
తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోకి తగ్గట్టు మంచి క్యాప్షన్ చెబితే.. మహీంద్ర మోడల్ స్కేల్ కారు బహుమతిగా లభిస్తుందని పేర్కొన్నాడు.

డిటిహెచ్ పై ఓ కోతి తిష్ట..
ఓ ఇంటి పైకప్పు మీద ఉన్న డిటిహెచ్ యాంటీనాపై ఓ కోతి తిష్ట వేసింది. ఆ ఫొటోకు చక్కని క్యాప్షన్ పెడితే రెండు మహీంద్రా స్కేల్ మోడల్ కార్లు ఇస్తానని చెప్పారు. ఈ క్యాప్షన్ హిందీ, ఇంగ్లీష్ లో పంపవచ్చని (అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు డెడ్ లైన్) చెప్పాడు.

నెటిజన్ల ఆసక్తి..
దీంతో నెటిజన్లు ఆ ఫొటో గురించి మంచి క్యాప్షన్ పెట్టేందుకు చాలా ఆసక్తి చూపారు. ఒక్కొక్కరు ఒక్కోలా ట్రై చేశారు. ఎవరికి వారు తమకు మహీంద్రా స్కేల్ మోడల్ కారు కోసం తెగ ప్రయత్నించారు. మరి బెస్ట్ క్యాప్షన్ ఎవరు పెట్టారు.. ఎవరు విజేతగా నిలిచారనే విషయాన్ని ఆనంద్ మహీంద్రా వెల్లడించలేదు. త్వరలోనే వారికి ఆ బహుమానం ఇచ్చే అవకాశం ఉంది.

బొమ్మలాంటి కారు..
ఇక్కడే చాలా మంది పొరపాటు పడ్డారు. చాలా మంది స్కేల్ మోడల్ కారు నిజమైన కారు అని అనుకున్నారు. కానీ స్కేల్ మోడల్ కారు అంటే చిన్న బొమ్మ లాంటి కారు అని అర్థం. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ పోస్టులో స్పష్టంగా రాశారు.

నిజమైన కారులాగే..
అయితే స్కేల్ మోడల్ కారు కూడా నిజమైన కారులాగే ఉంటుంది. అయితే దీని విలువ లక్షల రూపాయల్లో ఉండదు. కేవలం వేల రూపాయల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి స్కేల్ మోడల్ కారంటే ఎన్ని లక్షలో ఉంటుందని అనుకోకండి సుమా...!



Click it and Unblock the Notifications
