Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వైరల్ వీడియో : అప్పుడు ‘బాబా కా దాబా’.. ఇప్పుడు సైకిల్ పై దోశలు అమ్మే వ్యక్తి...
సైకిల్ పై వేడి వేడి దోశలను అమ్ముతున్న వ్యక్తి నెట్టింట వైరల్ అవుతోంది.
మనం ఉదయం నిద్ర లేచిందగ్గర్నుంచి ఏ కాలనీలో చూసినా.. ఏ గల్లీలో చూసినా చిన్న చిన్న హోటల్స్ మనకు కనబడుతుంటాయి. మనకు కావాల్సిన టిఫిన్లు, దొరికేస్తుంటాయి. పైగా ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా ఒక్క క్లిక్ తో మనకు కావాల్సిన ఫుడ్ మన ఇంటికే వచ్చేస్తుంది.

అయితే ఇప్పటికీ మన కాలనీల్లో, ఇళ్ల వద్దకు వారి ఇంట్లోనే దోశెలు, ఇడ్లీలు, గుంత పొంగనాలు వంటివి ప్రీపేర్ చేసుకుని వచ్చి అమ్ముతుంటారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం సైకిల్ మీదే పొయ్యి పెట్టుకుని వేడి వేడిగా దోశెలు వేసేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఇది తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
All Images Credited : Youtube

ముంబైలో
ప్రస్తుతం మహారాష్ట్రలో, ముంబైలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మాస్కు లేకపోతే ఫైన్ వేస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే.. ముంబైలో మరో సంఘటన తెగ వైరల్ అవుతోంది.

పాతికేళ్ల నుండి..
ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి పాతికేళ్లుగా సైకిల్ పై దోశలు అమ్ముతున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని, వచ్చి అమ్ముతుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా స్పెషల్. సైకిల్ పైనే పొయ్యి పెట్టుకుని వేడి వేడి దోశెలను అమ్ముతున్నాడు.

ఓ యూట్యూబర్..
ఇది చూసిన ఓ యూట్యూబర్ ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలను వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలను షేర్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ అయిపోయింది.

13 మిలియన్లకు పైగా..
ఈ వైరల్ వీడియోను కొన్ని గంటల్లోనే 13 మిలియన్ల మందికిపైగా చూశారు. అంతేకాదు తనకు ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు.

టేస్టీ దోశ...
ముంబైకి చెందిన ఆ వ్యక్తి సైకిల్ పై ప్లెయిన్ దోశ, మసాల దోశలే కాకుండా.. వేడి వేడిగా పిజ్జా దోశలతో పాటు మరిన్ని రకాల దోశలను కస్టమర్లకు అమ్ముతున్నారు. సైకిల్ వెనుక పొయ్యి, పెన్నం అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని వీటిని సర్వ్ చేయడం విశేషం. ఆ దోశపై కూరగాయలు, చీజ్, అల్లం చట్నీ, సాస్ వంటివి వేసి టెస్టీగా అమ్ముతున్నాడు.

పాపులారిటీ పెరుగుదల..
ఈయన దగ్గర చాలా రకాల దోశలున్నాయి. ఒక్కో దోశను 60 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇవి చాలా సహజంగా తయారు చేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటాయట. ఇంతకీ ఆ వ్యక్తి పేరేంటో తెలుసా.. అతని పేరు ఆక్ష్న. ఇతను పాతికేళ్లుగా కష్టపడుతున్నా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఈ వీడియో ద్వారా ఆయనకు విపరీతంగా పాపులారీటి పెరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీలోనూ ఇలాగే ఓ వీడియో వైరల్ అయ్యింది. ‘బాబా కా దాబా' పేరుతో ఇన్ స్టాలో వీడియో అప్ లోడ్ చేయడంతో అతనికి గిరాకీ బాగా పెరిగిపోయింది.



Click it and Unblock the Notifications
