Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
వైరల్ వీడియో : కన్నతల్లిని ఢీకొట్టిందనే కోపంతో కారును కాలితో తన్నిన బుడ్డోడు... ఇంకా ఏం చేశాడంటే..
చైనా దేశంలోని చాంగ్ కింగ్ లో ఓ బుడ్డోడు తన తల్లితో కలిసి జిబ్రాక్రాసింగ్ మీదుగా రోడ్డును దాటుతున్నాడు. అంతలో ఒక కారు వచ్చి తల్లీబిడ్డలు ఇద్దరినీ ఢీకొనడంతో వారు కింద పడ్డారు. ఆ మరుక్షణమే ఈ బుడ్డోడు తేర
'స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ల గురించి ఆలోచించొద్దు. వాళ్లు ఎవ్వరూ నీ కన్నా గొప్పవారు కాదు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు'. కన్నబిడ్డలకు ఏ చిన్న గాయం అయినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అయితే ఆ తల్లికే అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే.. అనుకోని కష్టం ఎదురైతే.. ఎంతమంది వారిని ఓదారుస్తారు. ఈరోజుల్లో అయితే అలాంటివి జరగడం కష్టమే అనిపిస్తుంది.

కానీ చిన్నపిల్లలు మాత్రం తమ తల్లికి ఏదైనా ప్రమాదం జరిగితే చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతారు. సినిమాల్లో హీరోల్లా తమ హీరోయిజాన్ని చూపుతారు. తన తల్లికి కష్టం రావడానికి కారకులైన వారిపై తిరగబడతారు. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవ్వరిని ఎదిరించడు.. ఎవరిని కాలితో తన్నాడు.. ఆ వీడియో ఎందుకు అంత వైరల్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే....
తల్లిబిడ్డల అనుబంధం...
తల్లిబిడ్డల అనుబంధానికి మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తల్లి యొక్క విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ బుడ్డోడు తన తల్లిపై తనకు ఎంత అమితమైన ప్రేమ ఉందో ఆ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది.

కారు ఢీకొనడంతో..
చైనా దేశంలోని చాంగ్ కింగ్ లో ఓ బుడ్డోడు తన తల్లితో కలిసి జిబ్రాక్రాసింగ్ మీదుగా రోడ్డును దాటుతున్నాడు. అంతలో ఒక కారు వచ్చి తల్లీబిడ్డలు ఇద్దరినీ ఢీకొనడంతో వారు కింద పడ్డారు. ఆ మరుక్షణమే ఈ బుడ్డోడు తేరుకొని తన తల్లికి ఏమైందో అని గాబరగా చూశాడు. అంతే ఒక్కసారిగా తనలో కోపం పెరిగిపోయింది..

కోపం తట్టుకోలేక కారును కాలితో..
వెంటనే సినిమాలో హీరోలా పైకి లేచి తమ ప్రమాదానికి కారణమైన కారును కాలితో తన్నాడు. అంతటితో ఆ బుడ్డోడు ఆగలేదండోయ్. కారులో కూర్చున్న వ్యక్తిని ధైర్యంగా ఎదిరించాడు. అయితే కారులో వ్యక్తి బయటకు రావడంతో మళ్లీ తన తల్లి దగ్గరికి వెళ్లాడు.

గుమిగూడిన జనాలు..
ఆ సంఘటనను చూసిన చుట్టుపక్కల జనాలు వెంటనే అక్కడ గుమిగూడారు. కారు నడిపిన వ్యక్తి కూడా ఆ బుడ్డోడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. అదే కారులోనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

తల్లీ బిడ్డల మధ్య ప్రేమ..
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలకు ఎలాంటి గాయం కాలేదు. ఈ ప్రమాదానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు ఆ కారు డ్రైవర్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. చూశారు కదా తల్లీబిడ్డల మధ్య ప్రేమ ఎంత విలువైనదో.. ఎంత స్వచ్ఛమైనదో ఈ వీడియోను ఒక చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి వైరల్, ప్రత్యేక, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
