Latest Updates
-
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం!
Vruschika Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత’ ఏడాదిలో వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరి కొద్ది రోజుల్లో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం. ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం, 'శుభకృత' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-14, వ్యయం-14
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. ఈ ఏడాదిలో ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బు వస్తుంది. అయితే, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2,3,4 నాలుగు పాదాలు, జ్యేష్ట నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-03, అవమానం-01
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురు గ్రహ ప్రభావం వల్ల 2022 ఏప్రిల్ మాసం నుండి సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడొచ్చు. మరోవైపు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి పెద్దల నుండి అనుమతి లభిస్తుంది. విడిపోయిన వారు తమ బంధాలను మళ్లీ తిరిగి కొనసాగిస్తారు. స్నేహితుల వల్ల లాభపడతారు. మొత్తానికి గురు గ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉండటంతో ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడనున్నాయి.

శని ప్రభావం వల్ల..
తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శని గ్రహం ప్రభావం వల్ల ఏప్రిల్ 2022 నుండి 2023 జనవరి 17వ తేదీ వరకు కొద్దిగా మానసిక ధైర్యం తగ్గుతుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సులభంగా సంపాదన లభిస్తుంది. అయితే 2023 జనవరి నుండి మీకు ప్రశాంతత అనేది కరవవుతుంది. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయితే ఈ ఏడాది ఈ రాశి వారికి ఏలి నాటి శని లేదు.

రాహు ప్రభావం..
తెలుగు నూతన సంవత్సరంలో కేతు ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం పొందుతారు. మరోవైపు ఈ కాలంలో మీరు శత్రువుల బాధ నుండి విముక్తి పొందుతారు. ప్రత్యర్థుల కుట్రలను మీరు భగ్నం చేస్తారు. మొత్తానికి ఈ ఏడాది రాహువు ప్రభావం వల్ల మీకు శుభ ప్రదమైన ఫలితాలు ఏర్పడతాయి.

కేతు ప్రభావం..
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో కేతువు ప్రభావం వల్ల, మీరు చేపట్టే ప్రయత్నాల్లో ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఆలోచనలేవీ కలసి రాకపోవడంతో ఒక రకమైన అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ కాలంలో మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మీ మనసులో ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. చివరగా కేతువు వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రతికూల ఫలితాలు ఉండవు.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో మీరు ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు నిత్యం వినాయకుడిని ఆరాధించాలి. అలాగే మరకగత గణపతిని పూజించాలి. తెల్లజిల్లేడు వేరుతో చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శని భగవానుడి అనుగ్రహం పొందడానికి నిత్యం ఈశ్వరుడిని స్మరించుకోవాలి. శనివారం రోజున నల్లనువ్వులను నానబెట్టి.. వాటిని బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి. ఆవుకు ఇతర ఆహార పదార్థాలు అందించాలి. వీలైతే గోశాలకు వెళ్లి గోసేవ చేసి.. కుదిరితే ఆర్థిక సాయం చేయాలి.



Click it and Unblock the Notifications