For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు..

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

Weekly Rashi Phalalu

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోపం మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీరు గందరగోళ పరిస్థితుల నుండి దూరంగా ఉండాలి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనికి రాని వస్తువలపై మీరు డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తారు. శృంగార జీవితం విషయానికొస్తే, మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :21

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు కెరీర్ పరంగా ఈ వారం మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తుంటే, పెద్ద ప్రాజెక్ట్ మీకు రావడం వల్ల మీ పని కొంచెం పెరుగుతుంది. ఈ ఏడు రోజులు వ్యాపారులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే చిన్న అవరోధాలు ఉంటాయి, కానీ మొత్తంగా మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు విద్యార్థి అయితే, మీ విద్యలో పెద్ద విరామం ఉండవచ్చు, అది మీకు కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మీరు పూర్తి చిత్తశుద్ధితో అధ్యయనం చేయడం మంచిది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ :రెడ్

లక్కీ నంబర్ :11

లక్కీ డే : మంగళవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవిత సమస్యలు ముగియవచ్చు. మీ జీవితం సరైన దిశలో పయనిస్తుందని మీరు భావిస్తారు. మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు. ఇతరులు కూడా మీతో అంగీకరిస్తారు. మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు చేసిన తప్పుకు మీరు చింతిస్తారు. మీ ప్రియమైన వారికి క్షమాపణ చెప్పడం ద్వారా మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మీరు ప్రయత్నించవచ్చు. ఈ వారం చాలా పని ఒత్తిడి ఉంటుంది. సీనియర్లు కూడా మీతో కఠినంగా ప్రవర్తించగలరు. అటువంటి పరిస్థితిలో మీ పనిని శాంతియుతంగా కొనసాగించండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ డే : శనివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారి ప్రత్యర్థులు ఈ వారం చురుకుగా ఉంటారు. వారు మీకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో చాలా జాగ్రత్తగా పనిచేయండి. మరోవైపు ముఖ్యంగా వ్యాపారులు చాలా జాగ్రత్తగా లావాదేవీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా విజయాలు దక్కొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు తీవ్రమవుతాయి. కొంతకాలం మౌనంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయాలు ప్రతికూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పనిలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే మీ కోరిక కూడా నెరవేరవచ్చు. కాబట్టి సంతోషంగా మరియు ఒత్తిడి లేకుండా ఉండండి. ఈ వారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ వారం మీరు శృంగార జీవితంలో చాలా ఆనందదాయకమైన సమయాన్ని గడుపుతారు. మీరు వివాహం కోసం మీ భాగస్వామిని కూడా ప్రతిపాదించవచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ :10

లక్కీ డే : గురువారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం శృంగార జీవితంలో మీరు నిరాశ చెందవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరుగుతాయి. ఇది మీ మధ్య దూరం పెరిగేందుకు దారి తీస్తుంది. మీరు మీ సంబంధాన్ని మెరుగు పరచాలనుకుంటే, మీ భాగస్వామిని అనుమానించడం మానుకోండి. మీరు వివాహం చేసుకుంటే ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు కూడా బాగుంటాయి. మీరు వారితో కూడా యాత్రకు వెళ్ళవచ్చు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఈ వారం ఏదైనా విలువైన వస్తువు కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఈ వారం ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మీరు విద్యార్థి అయితే, మీరు ఈ కాలంలో మీ అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే మీకు సరైన ఫలితాలు రావు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 40

లక్కీ డే : బుధవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక విషయాల పట్ల స్పృహతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి మీరు తుది నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. ప్రేమ విషయాలలో ఈ వారం ప్రత్యేకమైన వారితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు వారి ముందు ప్రేమ ప్రతిపాదనను కూడా ఉంచవచ్చు. ఈ వారం వివాహిత జంటలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో మీరు కుటుంబంతో అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారాన్ని తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :28

లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారి కుటుంబంలో ఈ వారం ఆనందం ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీరు విద్యార్థి అయితే మీ విద్యలో ఏదైనా అడ్డంకి ఈ వారంలో పరిష్కరించబడుతుంది. కళాశాలలో ప్రవేశానికి సంబంధించి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ఈ వారం ఆ విషయంలో ఊపిరి పీల్చుకుంటారు. వివాహ జీవితంలో ప్రేమను మీరు అనుభవిస్తారు. ఈ వారం ఉద్యోగులకు చాలా మంచిది. మీరు కష్టపడి పని చేస్తారు. మీ ప్రత్యర్థులకు కఠినమైన పోటీని ఇస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. మీరు డబ్బును ఆదా చేయగలుగుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :18

లక్కీ డే : సోమవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు వ్యాపారం చేస్తే, దాన్ని విస్తరించడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మీ ఆందోళన పెరగొచ్చు. ప్రేమ విషయంలోనూ మీ భాగస్వామి స్వభావంలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీరు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ :12

లక్కీ డే : ఆదివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పవిత్రంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించవచ్చు. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు ఈ వారం కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఈ సమయంలో మీరు ఏదైనా పని సంబంధిత ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ వారం కూడా వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మీ భాగస్వామితో కలిసి మీ వ్యాపారాన్ని మరింతగా పెంచడానికి మీరు కృషి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. మీరు సానుకూల సమాధానం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, క్రమంగా పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీకు మంచిది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :34

లక్కీ డే : గురువారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో పరిస్థితులు కొంత కష్టంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని మానసికంగా కలవరపెడుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు క్షీణిస్తాయి. మీరు మీ ప్రియమైనవారితో ప్రేమ మరియు పరస్పర చర్యలను పెంచుకోవాలనుకుంటే, వారితో సాధ్యమైనంత వరకు మర్యాద పూర్వకంగా వ్యవహరించండి. మీరు ఒంటరిగా అనిపించవచ్చు. మీ వివాహ జీవితం గురించి మాట్లాడితే, మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో, మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ఈ ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం బాగుండదు. జాగ్రత్తగా ఉండటం మంచిది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :22

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో దాదాపు మెరుగుదలనే చూస్తారు. పని విషయంలో కూడా పూర్తి ఉత్సాహంతో మరియు ఏకాగ్రతతో పని చేస్తారు. ఇది మీ పురోగతికి మార్గంగా నిలుస్తుంది. అయితే మీరు ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో మీకు చాలా బాధ్యతలు ఉండవచ్చు. కానీ మీరు ధైర్యాన్ని కోల్పోరు. ఈ సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబాల మధ్య పరస్పర సమన్వయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈసారి మీ తల్లిదండ్రులతో మీకు గొప్ప సమయం ఉంటుంది. మీరు అవివాహితులైతే, ఈ సమయంలో మీ కుటుంబం వివాహం కోసం మీపై ఒత్తిడి తెస్తుంది. ఈ వారం ఆర్థిక పరంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ డే : శనివారం

English summary

Weekly Rashi Phalalu for January 5 to January 11

The year 2020 has started and we are all ready to start a new beginning. How will the first week of the year be for you? To know, read your weekly horoscope and get answers to all your big and small questions.
Story first published: Sunday, January 5, 2020, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more