For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు జులై 19వ నుండి జులై 25వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. మరోవైపు ఈ వారం కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి.

Weekly Rashi Phalalu for July 19 to July 25

డబ్బుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే, అవన్నీ తొలగిపోవచ్చు. ఈ వారం కొన్ని రాశుల విద్యార్థులకు
అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు అధ్యయనంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. అలాగే ఆన్ లైన్ తరగతులను అస్సలు మిస్ అవ్వకూడదు. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు ద్వాదశ రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా?

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే ఈరోజు ముగిసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన నిర్ణయం కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీరు ప్రయాణం చేస్తుంటే, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉండవచ్చు. వారం చివరిలో కొంతమంది అతిథుల రాకతో, మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 29

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే అలవాటు కారణంగా, మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ ప్రవర్తన కారణంగా మీరు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు వివేకంతో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ఈ వారం ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. ఈ వారం మీరు చాలా ముఖ్యమైన పనులను ఒకేసారి పూర్తి చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పనితో పాటు, మీ ఆరోగ్యం మీకు సమానంగా ముఖ్యమైనది. మీరు వారం చివరిలో ఏదైనా శుభవార్త పొందవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ డే : గురువారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పని చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు విదేశీ సంస్థల పని చేస్తుంటే, మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే మీరు కష్టపడి పనిచేస్తే మీకు విజయం దక్కుతుంది. మరోవైపు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ ఏడు రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారం మధ్యలో, అకస్మాత్తుగా ఒక పెద్ద వివాదం తలెత్తుతుంది. ఇంటిలోని కొంతమంది సభ్యులతో గొడవ జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మరోవైపు, చాలా క్లిష్ట పరిస్థితిలో, మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 38

లక్కీ డే : మంగళవారం

కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి...కర్కాటకంలోకి సూర్యుడు.. మకరంలోకి శని ప్రవేశిస్తే... 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి...

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం సామాజిక జీవితంపై శ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే పనిలో ఎంత కష్టపడితే, అంత ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, మీరు మీ పనిని పూర్తి ధైర్యంతో, నిజాయితీతో చేస్తూనే ఉంటారు. మీ లక్ష్యం వైపు కదులుతూ ఉంటారు. మీ అనుకూలత త్వరలో కొంత గొప్ప విజయానికి దారితీస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు బ్యాంకింగ్ రంగంతో సంబంధం కలిగి ఉంటే, ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు. కానీ మీరు ఈ కాలంలో మీ కృషి యొక్క ఫలాలను కూడా పొందవచ్చు. ఉన్నత పదవి సాధించడంతో మీ జీతం పెరిగే శుభవార్త మీకు లభించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ వారం, లాక్డౌన్ కారణంగా వ్యాపారులు ఎదుర్కొన్న నష్టాన్ని తిరిగి పొందటానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ప్రైవేట్ జీవితంలో కూడా ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబం కోసం చాలా ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీరు మీ మనస్సు మాటనే వినాలి. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోవద్దు. వ్యాపారులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. అకస్మాత్తుగా పనిభారం మీపై పెరగవచ్చు. కానీ మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా పని చేయాలి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే, ఈ వారం మీకు ప్రత్యేక లాభం ఉండదు. మీరు మీ ప్రియురాలితో కలిసి మీ వైవాహిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. మీరు విద్యార్థి అయితే ఈ వారం మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ డే : శుక్రవారం

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుందది. మీకు ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే, మీరు సకాలంలో మందులు తీసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పని విషయంలో ఏదైనా అలసట అనిపిస్తే, వెంటనే విరామం తీసుకోవాలి. మీరు ఒత్తిడికి లోనవుతుంటే మీ పనితీరు తగ్గుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో మీ బడ్జెట్‌ను వారానికి ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో మీరు మీ కుటుంబానికి పూర్తి మద్దతు పొందుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 27

లక్కీ డే : సోమవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వారం ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే మీ పనిని పూర్తి విశ్వాసంతో చేయడం మంచిది. గ్రహాల స్థానం మీకు గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా, మీ పనులన్నీ పెండిగులో పడిపోతాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఈ వారం పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : బుధవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఏదైనా విషయంలో విజయం సాధించాలంటే, మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఒత్తిడి తీసుకోవడం ద్వారా ఏమీ పొందలేరు. మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టాలి. పనికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా తాత్కాలికమే. మీ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో, మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. వారం మధ్యలో మీకు మంచిగా ఉంటుంది. ఈ వారం మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 25

లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ వారం మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే సమయం తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మంచి ప్రణాళికతో అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాంకింగ్ రంగంలో ఉంటే, మీరు ఈ కాలంలో పెద్ద సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి సానుకూలతతో పని చేస్తూ ఉండండి. వారం మధ్యలో మీకు కష్టమవుతుంది. మనస్సులో అసంతృప్తి భావన ఉంటుంది. మీరు మానసికంగా పరధ్యానంలో ఉంటారు. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఇటీవల ఎందులో అయినా పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 45

లక్కీ డే : సోమవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో అదృష్టం లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు నిరాశ చెందుతారు. చిన్న వ్యాపారులు ఈ సమయంలో డబ్బు సంబంధిత సమస్యలను వదిలించుకోవచ్చు. ఈ సమయంలో మీ పని బాగా జరుగుతుంది. మీకు ఆర్థిక ప్రయోజనం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారంలో వారి ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ పనిని సులభంగా చేయగలుగుతారు. ఈ కాలంలో మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు. దీనివల్ల ప్రజలతో గొడవ పడవచ్చు. విద్యార్థులకు ఈ వారం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మంచిది కాదు. ఒత్తిడి కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ చూపలేరు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 26

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఈ వారం విజయం సాధించవచ్చు. మరోవైపు ఉద్యోగులు, తమ పనితీరు ద్వారా ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. ఈ సమయం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. మీ నిర్ణయం గురించి మీరు చాలా గందరగోళంలో పడే అవకాశం ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిది. మీ మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. తద్వారా మీకు కొత్త ఆలోచనల యొక్క పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఈ వారం డబ్బు విషయంలో కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వారం డబ్బు కొరత ఉండదు. ఇది కాకుండా, సంపద పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : గురువారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for July 19 to July 25

In the year 2020, Third week of July will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion