For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 14 నుండి జూన్ 20వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల నిరుద్యోగులకు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మరి కొన్ని రాశుల ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ అవుతుంది. అయితే పని భారం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయినా నిరుత్సాహపడకుండా, పనిపై శ్రద్ధ పూర్తి పెడతారు. చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Weekly Rashi Phalalu for june 14 to June 20

త్వరలో సూర్యగ్రహణం ప్రారంభం కానున్న సందర్భంగా 12 రాశి చక్రాల వారిపై చాలా వరకు ప్రభావం ఉంటుంది. మరోవైపు ఈ వారం కొన్ని రాశుల వారిలో వివాహం కాని మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ వారం రాశిచక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసుకోండి...

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది. ఈ వారం మీ ఇంట్లో శుభకార్యాలు ఉండవచ్చు. ఈ సమయం మీరు కుటుంబంతో గడుపుతారు. మీరు పిల్లలకు సంబంధించిన ఏవైనా ఆందోళనలను తొలగిస్తారు. వారి విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పురోగతి లభించే అవకాశం ఉంటుంది. మీరు సమయానికి ఆదాయం పొందే బలమైన అవకాశం ఉంది. మీరు పాత ఆస్తిని విక్రయించాలని యోచిస్తున్నట్లయితే, మీరు ఈ వారం కొన్ని శుభవార్తలను వినొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. ఏ విషయమైనా కోపంతో కాకుండా ప్రేమతో వారిని ఒప్పించడానికి ప్రయత్నించండి.

ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ సీక్రెట్స్ ను షేర్ చేసుకోకండి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ డే : శనివారం

 వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీ దీర్ఘకాలిక కోరిక ఈ వారంలో నెరవేరుతుంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీరు వ్యాపారం చేస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీరే నష్టపోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం మంచి అన్వేషణలు ప్రారంభించండి. మీరు ఇనుము, కలప, తోలు, బంగారం, వెండి లేదా ఆహార పదార్థాలను వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని కొత్త రచనలు కూడా చేతికి రావచ్చు. ఈ వారం ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 24

లక్కీ డే : ఆదివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం భాగస్వామితో కలిసి బాగా కష్టపడతారు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కోరుకున్న బదిలీ లేదా ఉన్నత హోదా పొందవచ్చు. ఈ మార్పు వల్ల మీ కెరీర్ కొత్త దిశలో పయనిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. ఆదాయం గురించి ఎలాంటి సమస్యలు ఉండవు. దీని వల్ల మీరు బాగా రిలాక్స్ అవుతారు. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. కుటుంబ పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : గురువారం

అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ‘‘అష్టలక్ష్మీ స్తోత్రం''!!అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ‘‘అష్టలక్ష్మీ స్తోత్రం''!!

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ వారం సోమరితనం మానుకోవాలి. లేదంటే మీ పురోగతి ఆగిపోవచ్చు. విద్యార్థులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీ విద్యలో మీకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిమితుల కారణంగా ఈ వారం చాలా పనులు పెండింగులో పడిపోతాయి. మీరు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ కాలంలో కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు మీ పనిని పాడుచేయటానికి తమ వంతు కృషి చేయవచ్చు. మీరు తెలివితేటలతో పనిచేస్తే, మీరు ఇబ్బంది నుండి తప్పించుకోవచ్చు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ప్రశాంతంగా పని చేయాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఈ కాలంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాలలో ఏ మూడో వ్యక్తిని జోక్యం చేసుకోవడానికి అనుమతించకపోవడం మీకు మంచిది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : సోమవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు చాలా ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఏదైనా మార్పు కోరుకుంటే, మీ యజమానితో మాట్లాడటానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎలాంటి సమస్యలకైనా సులభంగా పరిష్కారం కనుగొంటారు. ఎందుకంటే మీరు మానసికంగా బలంగా ఉంటారు. అలాగే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మరోవైపు ఈ వారం మధ్యలో, మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 29

లక్కీ డే : ఆదివారం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

 తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో పెద్ద మార్పు ఉండొచ్చు. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ వారం మీరు గొప్ప ఆఫర్ పొందవచ్చు. ఈ మార్పు మీ కెరీర్‌కు చాలా మంచిది. మరోవైపు, ఈ కాలంలో వ్యాపార వ్యక్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు పూర్తి విశ్వాసంతో చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, మీరు ఆతురుతలో ఎటువంటి నిర్ణయం తీసుకోరని గుర్తుంచుకోండి. లేకపోతే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని చవిచూడవచ్చు. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే, ఈ వారం బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : బుధవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా ఉండదు. ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. మీరు కొన్ని మార్పులు చేయాలనుకుంటే, వేగంగా, మరియు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారంలో పనిలో ఒత్తిడిని తగ్గించడానికి కొంత సమయం విరామం తీసుకోవాలి. స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో సమయం గడపండి. ఇది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా నిరాశ చెందుతారు. ఈ వారం ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : సోమవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. అంతేకాదు, మీరు రాబోయే కాలంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం సమయం అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. పని లేదా వ్యాపారం విషయంలో మీరు ఎక్కువగా కష్టపడాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో, ఈ సమయం చాలా సరదాగా ఉంటుంది. వారం చివరిలో మీరు ఒక చిన్న యాత్ర చేయవలసి ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : శుక్రవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చిన్న సమస్యలు ఉండొచ్చు. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు ఈ సమయంలో ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. అయితే మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం మంచి ఉపశమనం లభిస్తుంది. రాబోయే కాలంలో మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వారం ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఈ ఏడు రోజులు మీ జీవిత భాగస్వామితో బాగా గడిచిపోతాయి. ఈ సమయంలో మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీరు గ్రహిస్తారు. ఆరోగ్యం విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : గురువారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు తెలివిగా వ్యవహరించాలి. మీరు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది. వివాహితులకు ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించదు. మీరు మీ పనులతో చాలా బిజీగా ఉండవచ్చు. ఈ కాలంలో ఉద్యోగ నిపుణులు ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయకపోతే, ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ చెడిపోతుంది, ముఖ్యంగా మీరు పురోగతిని ఆశిస్తున్నట్లయితే, మీరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి పనిలో లేదా ఉద్యోగంలో చాలా కష్టంగా ఉంటుంది. ఈ వారరం మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మిమ్మల్ని మీరు నమ్మండి, త్వరలో మీ కృషికి రంగు వస్తుంది. జీవితంలో సమస్యలకు భయపడకుండా, మీరు వాటిని గట్టిగా ఎదుర్కొంటారు. అప్పుడు అతిపెద్ద సమస్యలను కూడా సులభంగా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా బకాయి ఉన్న రుణం ఉంటే, ఈ వారం, తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా సజావుగా సాగుతుంది. ఈ సమయంలో, మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది పరస్పర సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ సమయంలో, తల్లిదండ్రులు మీకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : శుక్రవారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for june 14 to June 20

In the year 2020, Third week of June will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion