For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 7 నుండి జూన్ 13వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పనిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే పరిస్థితులు క్రమంగా సాధారణంగా మారిపోతాయి. మరి కొన్ని రాశుల ఉద్యోగులకు పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా నిరుత్సాహపడకుండా, పనిపై శ్రద్ధ పూర్తి పెడతారు. చాలా వరకు కొన్ని రాశుల వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Weekly Rashi Phalalu

ఇటీవలే రెండో చంద్ర గ్రహణం విజయవంతంగా పూర్తవడంతో, చాలా రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా పడింది. మరోవైపు ఈ వారం కొన్ని రాశుల వారిలో వివాహం కాని మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ వారం రాశిచక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసుకోండి...

చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో ఒడిదుడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో చిన్న సమస్యలు ఉండవచ్చు. అయితే క్రమంగా పరిస్థితి సాధారణంగా మారుతుంది. ఉద్యోగులపై ఉన్నతాధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా తప్పు చేస్తే, భయపడకుండా ఒప్పుకోవాలి. ఈ వారం మీరు చాలా కష్టపడాలి. మీ కుటుంబ జీవితంలో శాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా వారంలోని ఏడు రోజులు మంచిగా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు భౌతిక దూరాన్ని పాటించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : గురువారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం దృష్టి అంతా పనిపైనే ఉంటుంది. మీరు మీ ముఖ్యమైన మరియు పెండింగ్ పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. మీరు ఏదైనా ప్రాజెక్టులో పని చేస్తుంటే, సహోద్యోగులతో కలిసి పని చేయాలి. మీరు వారి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారులు ఈ వారం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అయితే మీ ప్రవర్తనలో ప్రతికూల మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏవైనా రుణాలు తీసుకోవచ్చు. మీరు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : శుక్రవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. ఉద్యోగులు వేతనం విషయంలో చాలా ఆందోళన చెందుతారు. వ్యాపారులపై కూడా ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలం కావచ్చు. ఈ వారం మీరు శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు కొంత కాలం కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈ వారం పనికి సంబంధించి మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 23

లక్కీ డే : ఆదివారం

జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీరు మీ పని విషయంలో చాలా ఓపికగా ఉండాలి. లేదంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు మీ సీనియర్లతో వాదించడం మానుకోవాలి. ఆర్థిక పరంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం మీ ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తి గురించి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మరోవైపు మీరు అద్దె ఇంట్లో ఉంటూ, సొంత ఇంటి గురించి కలలు కంటుంటే, ఈ వారం మీరు కొన్ని మంచి వార్తలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఈ వారం చాలా సన్నిహితంగా ఉంటారు. మీ ఇద్దరికి పరస్పర అవగాహన ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం కొంత మెరుగుదల ఉంటుంది. మీరు మీ స్నేహితుడికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. ఈ వారం పని సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. మీ ఇంట్లో మీకు శాంతి ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు. అవివాహితులకు ఈ వారం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. వివాహితులకు జీవిత భాగస్వామితో ఆనందం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు ఉండవు. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఆర్థిక నిర్ణయాలు ఇదే విధంగా తీసుకుంటే, మీ కలలన్నీ త్వరలో నెరవేరుతాయి. పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనది. మీ కెరీర్ లో కొత్త మలుపు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : శుక్రవారం

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఆగిపోయిన మీ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఇది మీ బాధ్యతలను పెంచుతుంది. అయితే మీరు చాలా కష్టపడాలి. ఉద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు ప్రతికూల పరిస్థితులలో వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం శుభవార్తలను వినొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం సమయం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 13

లక్కీ డే : బుధవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు సరైన సమయంలో సరైన అవకాశాన్ని తీసుకుంటే, ఈ వారం మీకు సరదాగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం చాలా భారంగా అనిపిస్తుంది. మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆనందాన్ని మీరు చూసుకోవాలి. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు. జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటే, మీ జీవిత భాగస్వామితో కోపం మరియు ఘర్షణను నివారించాలి. పిల్లల చదువులు మీకు అడ్డంకిగా మారి మీరు చాలా ఆందోళన చెందుతారు. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులకు వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే త్వరలో మీరు వాటిని అధిగమించే అవకాశం ఉంది. మీరిద్దరూ చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. మరోవైపు ఉద్యోగులు సరైన ఫలితాలు పొందడం లేదని భావిస్తారు. ఏది ఏమైనా మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగానే ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండొచ్చు. అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలను చేయకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : ఆదివారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత లేకపోవడం, అధ్యయనాలపై తక్కువ ఆసక్తి కలిగి ఉండటం, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని ఎదుర్కొంటారు. అయితే మీరు వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు పేదవారికి ఆర్థిక సహాయం చేయొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 25

లక్కీ డే : శనివారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారిలో అవివాహితులకు ఈ వారం మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో మీరు వివాహం చేసుకోవచ్చు. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు అన్నయ్య నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పెండింగ్ పనులన్నింటినీ కచ్చితంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య పరమైన విషయాలు బాగానే ఉంటాయి. మీ మానసిక స్థితి బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : మంగళవారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for june 7 to June 13

In the year 2020, Second week of June will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, June 7, 2020, 1:36 [IST]
Desktop Bottom Promotion