Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
చంద్ర గ్రహణం తర్వాత మంచి రోజులెప్పుడో చూడండి...
2020 సంవత్సరం జూన్ లో వ్రతాలు మరియు పండుగల గురించి తెలుసుకుందాం...
ఇప్పటికీ ప్రపంచాన్ని చిగురుటాకుల వణికుస్తన్న కరోనా మహమ్మారి వల్ల చాలా మంది చిన్నారులు మరియు వయసు పైబడిన పెద్దలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అందరూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

త్వరలోనే తమకు ఇంటి నుండి బయటపడే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరంలో ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. చూస్తుండగానే జూన్ నెల కూడా వచ్చేసింది.

ఈ సందర్భంగా ఈ నెలలో ఏయే సమయంలో ఏకాదశులు వచ్చాయి.. ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి. అలాగే గుప్త నవరాత్రులు ఎప్పుడొచ్చాయి.. జూన్ నెలలోనే జగన్నాథుడి రథయాత్ర జరగనుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నిర్జల ఏకాదశి..
జూన్ నెలలో 2వ తేదీన నిర్జల ఏకాదశి వచ్చింది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో నిర్జల ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పవిత్రమైన మనసుతో జరుపుకుంటే అన్ని ఏకాదశుల ఉపవాసాల యోగ్యత లభిస్తుందని చాలా మంది నమ్మకం.

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి..
ఈ సమయంలో చంద్ర గ్రహణం కూడా ఏర్పడనుంది. చాలా మంది ఈరోజు ఉపవాసం పాటిస్తారు. అలాగే ఈరోజున కబీర్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజు వివాహితులు, స్త్రీలలో చాలా మంది మర్రిచెట్టును ఆరాధిస్తారు. వారి భర్తలకు దీర్ఘాయువు ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు.

బసౌర పండుగ..
జూన్ 13వ తేదీ ఆషాఢ మాసానికి కృష్ణ పక్షం యొక్క అష్టమిలో షీతలాష్టమి బసౌరా పండుగ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు.

యోగిని ఏకాదశి..
ఈ నెలలోనే రెండో ఏకాదశి జూన్ 17వ తేదీ వచ్చింది. ఆషాఢ నెలలో ప్రకాశవంతమైన భాగంలో వచ్చే దానిని యోగిని ఏకాదశి లేదా షయనీ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలను పాటించడం ద్వారా పాపాలకు విముక్తి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారని నమ్ముతారు.

శివుని ఆరాధన..
జూన్ 19వ తేదీన నెలవారీ శివరాత్రి. ఇది ప్రతి నెల కృష్ణ పక్షం యొక్క చతుర్దశి నాడు వస్తుంది. ఈరోజును భోలేనాథ్ కు అంకితం చేసినట్లు భావిస్తారు. ఆ రోజున మనస్ఫూర్తిగా శివుడిని ప్రార్థించి, ఉపవాసం నుండి ఆ శంకరుని ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

సూర్య గ్రహణం..
ఇక ఇదే నెలలో జూన్ 21వ తేదీన ఆషాఢ అమావాస్య రోజున అంటే జూన్ 21న తొలి సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. దీనిని కంకణ్ సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు.

గుప్తా నవరాత్రితో పాటు..
జూన్ నెలలో గుప్తా నవరాత్రి చైత్ర మరియు శారదియా నవరాత్రితో పాటు, గుప్తా నవరాత్రి అని పిలువబడే మరో రెండు నవరాత్రులు ఉన్నాయి. ఈ తొమ్మిదిరోజులు తంత్ర అభ్యాసంపై ఆసక్తి ఉన్న వారికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గుప్త నవరాత్రి జూన్ 22న వచ్చింది.

జగన్నాథ రథయాత్ర..
ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథుని పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఘనంగా నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications
