For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు మార్చి 22 నుండి 28వ తేదీ వరకు...

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి.

మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి.

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగతంగా చాలా ఓపికగా ఉండాలి. ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీరు మంచి ఆలోచనతో పనిచేస్తే, మీరు చాలా సమస్యలను అధిగమించవచ్చు. ఈ వారం మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈ వారం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించకుండా ఉండలి. ఆర్థిక పరంగా కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 18

లక్కీ డే : సోమవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ వారం మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. ఏదైనా చట్టపరమైన విషయం యొక్క నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీరు మీ భాగస్వామికి అండగా ఉండాలి. అలా చేయకపోతే, మీ వ్యాపారానికి ఏ విధంగానూ మంచిగా ఉండదు. మీరు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ సమయంలో, మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ వారం మంచి ప్రయోజనాలనే పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఈ వారం బాగుంటుంది. మీరు మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 7

లక్కీ డే : గురువారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం ఉంది. మీకు ఈ వారం జీతం పెరిగే బలమైన అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.మీరు ఓ లాభయకమైన ఒప్పందం చేసుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని కూడా పొందవచ్చు. క్రొత్త వ్యాపారంలో భాగస్వామి కావడానికి మీకు ఆఫర్ లభిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి వచ్చినప్పటికీ, మీరు ఎప్పుడూ పనికి వెనక్కి తగ్గరు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : ఆదివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ వారం చాలా విషయాల్లో సంయమనం పాటించాలి. నిరుద్యోగులకు ఈ వారం నిరాశే ఎదురుకావచ్చు. మీకు ఇష్టమైన ఉద్యోగం పొందలేరు. కానీ ఈ కారణంగా మీరు ప్రయత్నించడం మానేయకూడదు. మీరు కష్టపడి పని చేస్తారు. త్వరలో మీకు అదృష్టం లభిస్తుంది. వ్యాపారులకు ఒడిదుడుకుల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం ఖర్చులు భారీగానే ఉండే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : బుధవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. చాలా సమస్యలు ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. మీ నిరాశ కూడా తొలగిపోతుంది. మీరు పనితీరు గురించి ఆందోళన చెందుతుంటే, ఈ వారం మీరు కొంతమంది వ్యక్తుల సలహాలతో కూడా సహాయం పొందవచ్చు. అయితే, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది మీపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో మీ సంబంధం పెరుగుతుంది. వారు మిమ్మల్ని మరింత అర్థం చేసుకుంటున్నారని మీరు భావిస్తారు. ఈ వారం ఆర్థిక పరంగా కూడా మెరుగ్గానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : సోమవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఈ వారం మీ కోసం తగినంత సమయం పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం కూడా సానుకూలంగా అనిపిస్తుంది. ఈ వారం కొన్ని మంచి పనులు చేయవచ్చు. ఆర్థిక పరంగా మీ సమస్యలు పరిష్కారం కావచ్చు. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీ సానుకూల ఆలోచన మరియు శక్తితో మీరు కూడా ఈ రంగంలో ముందుకు దూసుకెళ్తారు. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీరు నిరుద్యోగులైతే మీరు ఉపాధి పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ డే : మంగళవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ వారం మీరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అయితే మీరు అవగాహనతో అలాంటి పరిస్థితుల నుండి బయటపడొచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ సీనియర్లు మీకు కొంత కష్టమైన పనిని అప్పగించవచ్చు. మీరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగితే, మీ పురోగతి కల త్వరలో నెరవేరుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ప్రైవేట్ జీవితంలో శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో కొంచెం గొడవ ఉండవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా విషయం పెరగనివ్వరు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకుంటారు, దాని ఫలితంగా మీకు ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇంటికి తిరిగి శాంతిని కలిగించడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు. మీరు ప్రతి ఒక్కరి దృక్పథాన్ని అర్థం చేసుకుంటారు. అపార్థాలు పెరగనివ్వరు. మీ ప్రయత్నాలు కూడా చాలా వరకు విజయవంతమవుతాయి. మీరు వివాహం చేసుకుంటే, ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా వినోదాత్మక సమయాన్ని కూడా గడుపుతారు. మీరు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ వారం మీరు కొంతమంది సానుకూల ఆలోచనాపరులను కలవవచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : శనివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం రొమాన్స్ పరంగా ఏవైనా సమస్యలుంటే, మీ భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవాలి. వారిని అర్థం చేసుకుని, వారిలో అపొహలను తొలగించుకోవాలి. మీ భాగస్వామిపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఉండాలి. మీరు వారిని ప్రేమతో ఒప్పించటానికి ప్రయత్నిస్తే, వారు మీ విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సమయంలో వ్యాపార రంగంలో మీరు మీ పాత సంబంధం నుండి చాలా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ వారం, మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 15

లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. త్వరలో మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగించబడతాయి. శారీరక వ్యాయామం చేస్తూ ఉండండి, అలాగే తినడం మరియు త్రాగడంలో అజాగ్రత్తగా ఉండకండి. ఎక్కువసేపు ఆకలితో ఉండడం మీ అలవాటు మీ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.

ఈ వారం మీరు ప్రతిదీ మరచిపోయి క్రొత్తదాన్ని ప్రారంభించవచ్చు. ఈ మొత్తంలో అవివాహితులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీ కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీరు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్రాతపనిపై శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : మంగళవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. అయితే, ఈ సమయంలో మీరు స్వయం సమృద్ధి సాధించాలి. మీ పని కోసం ఇతరులపై ఆధారపడవద్దు. మీరు ఉద్యోగస్తులైతే, ఈ సమయంలో మీరు మీ కృషితో అలాంటి అవకాశాన్ని పొందవచ్చు.మీరు త్వరలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ సమయం వ్యాపారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు. మీరు వ్యాపారం కోసం ఈ వారం కూడా ప్రయాణించవచ్చు. అయితే, మీ ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : ఆదివారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి ఈ వారం చాలా సందర్భాలలో సానుకూల ఫలితాలను చూడొచ్చు. ఈ వారం మీరు కొన్ని సామాజిక పనులలో పాల్గొంటారు. మీరు కొంత పేదవారికి కూడా సహాయపడవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. కానీ ఈ వారం మీరు ఇద్దరికీ సమాన శ్రద్ధ చూపగలుగుతారు. ఈ సమయంలో కొన్ని అడ్డంకులు రావచ్చు. కానీ మీరు అవన్నీ దాటి పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ వారం మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీకు మంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : బుధవారం

English summary

Weekly Rashi Phalalu for March 22 to March 28

In the year 2020, this last week of march will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published: Sunday, March 22, 2020, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more