Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ వారం మీ రాశి ఫలాలు మే 08 నుండి 14వ తేదీ వరకు..
రాశులను బట్టి వారి దిన, వార ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉన్నతాధికారులతో మీ సమన్వయం కూడా క్షీణించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపపడాల్సిన పనిని చేయకండి. మరి కొన్ని రాశుల వ్యాపారులకు ఈ వారం విజయం లభించొచ్చు.

ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద లాభాలను పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంకా కొన్ని రాశుల వారికి మీ ప్రియమైన వారితో మీ మానసిక అనుబంధం బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న ట్రిప్ కూడా చేయొచ్చు. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేస్తే పారదర్శకంగా ఉండాలి. ఉద్యోగులు ఈ కాలంలో ఏ పనిని పెండింగులో ఉంచొద్దు. మీపై పని భారం ఎక్కువగా ఉండొచ్చు. అలాగే పైఅధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 11
లక్కీ డే : బుధవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం కఠినంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో మీ సమన్వయం కూడా క్షీణించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపపడాల్సిన పనిని చేయకండి. వ్యాపారులకు ఈ వారం విజయం లభించొచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద లాభాలను పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైన వారితో మీ మానసిక అనుబంధం బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఒక చిన్న ట్రిప్ కూడా చేయొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు ఉండవు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ డే : సోమవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ రాశి వారిలో సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని చేసే వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. మీరు ప్రమోషన్ పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మరోవైపు ఈ రాశికి చెందిన నిరుద్యోగులు కూడా మంచి ఉపాధి అవకాశాలను పొందొచ్చు. మీ శ్రమ ఫలించగలదు. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఆరోగ్య పరంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ డే : శుక్రవారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మీరు కష్టపడి పని చేయడంలో చాలా వెనుకాడొద్దు. వ్యాపారులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు ఒంటరిగా ఉండి ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీ ప్రియమైన వారితో మాట్లాడేందుకు ఇదే సరైన సమయం. మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం దంతాలు, చెవులకు కొన్ని సమస్యలు పెరగొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 14
లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే మీరు ఓపికగా ఉండాలి. సరైన సమయం వచ్చినప్పుడు మీ సమస్య కచ్చితంగా పరిష్కరించబడుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. మీరు కష్టాల్లో వారి మద్దతును పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 25
లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మంచి విజయాన్ని పొందొచ్చు. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నట్లయితే, ఈ కాలంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారి నుండి మానసిక మద్దతు పొందుతారు. మీ వివాహ జీవితంలో మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 9
లక్కీ డే : గురువారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని పొందొచ్చు. ఉద్యోగులు ఈ వారం కోరుకున్న బదిలీని పొందొచ్చు. అంతేకాకుండా కార్యాలయంలో ఉన్నత స్థానానికి చేరుకోవడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా అందుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 24
లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. మరోవైపు ఈరోజు పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో పైఅధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈ కాలంలో మీరు చేసే పనిలో చాలా లోపాలను కనుగొంటారు. కాబట్టి మీరు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ డే : సోమవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు సంతోషకరమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులకు ఈ కాలంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడటంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 28
లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం కార్యాలయంలో పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీరు కొన్ని అదనపు బాధ్యతలను కూడా పొందొచ్చు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మీరు ఈ కాలంలో మరింత కష్టపడాలి. అప్పుడే మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. మీరు ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో మీ ప్రియమైన వ్యక్తి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 12
లక్కీ డే : మంగళవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులు అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకూడదు. లేదంటే మీరు పెద్దగా నష్టపోవచ్చు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన విషయాల్లో ఆందోళన పడొచ్చు. డబ్బు లేకపోవడం వల్ల మీ ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోవచ్చు. ఉద్యోగులకు ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ సమయంలో పనిభారం తక్కువగా ఉండటంతో పాటు ఉన్నతాధికారుల సహకారం కూడా లభిస్తుంది. మీరు పెద్ద కంపెనీలో ఉన్నత హోదాలో పని చేస్తున్నట్లయితే, ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు బాగానే ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 24
లక్కీ డే : సోమవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ సమయంలో మీరు పని పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, అది మీ పురోగతిపై చెడు ప్రభావం చూపుతుంది. మీ ప్రమోషన్ మధ్యలో నిలిచిపోవచ్చు. ఈ కాలంలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగా ఉంటుంది. ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 7
లక్కీ డే : ఆదివారం
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











