For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 10 నుండి మే 16వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి.

Weekly Rashi Phalalu

మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి.

ఈ నెలలో ఓ రాశి వారు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి...!ఈ నెలలో ఓ రాశి వారు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి...!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో అడ్డంకులు ఉండవచ్చు. అది మీ విశ్వాసాన్ని అస్థిర పరుస్తుంది. అయితే మీరు ఓపికగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు కుటుంబంలో ప్రతి ఒక్కరితో మీకు మంచి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. అయితే శృంగార జీవితంలో కొంత నిరాశ ఉంటుంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీపై చాలా కోపంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈ వారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్: స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : శుక్రవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడిని మరిచి మీరు సరదాగా పని చేయాలి. ఈ కాలంలో మీ కోసం తగినంత సమయం లభిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఈ వారం మీరు ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ఈ సమయం చాలా ఆనందంగా కుటుంబసభ్యులతో గడుపుతారు. మహిళలు తమ ఇంటి అలంకరణపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరోవైపు ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో సక్రమంగా వ్యవహరించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. వ్యాపారులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా బాగుంటుంది.

లక్కీ కలర్: లైట్ రెడ్

లక్కీ నంబర్ : 36

లక్కీ డే : మంగళవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పనిలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీరు అందరితో సఖ్యతగా వ్యవహరించాలి. ఈ వారంలో వ్యాపారులు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఈ సమయంలో పెద్ద వ్యాపారులు ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు అతివిశ్వాసంతో పనిచేస్తే ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. అయితే ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్: వైట్

లక్కీ నంబర్ : 17

లక్కీ డే : ఆదివారం

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు ఈ వారం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్ లైన్ క్లాసుల ప్రయోజనాలను పొందండి. ఉద్యోగులు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ వారం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రామిక ప్రజలపై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలి. ఈ వారం ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈ సమయంలో, మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్: బ్లూ

లక్కీ నంబర్ : 32

లక్కీ డే : గురువారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఒత్తిడి లేకుండా గడుపుతారు. ఈ వారం మీరు కుటుంబంతో ఆనందాన్ని అనుభవిస్తారు. మీ వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం ఇంట్లో కొన్ని ప్రత్యేక వేడుకలు జరుపుకోవచ్చు. మీరు ఇంటి సభ్యుని పుట్టినరోజును కుటుంబంతో ఉత్సాహంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈ వారం సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

లక్కీ కలర్: క్రీమ్

లక్కీ నంబర్ : 44

లక్కీ డే : సోమవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ వారం మీరు కొన్ని ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ వారం అందరితో కలిసి పనిచేస్తారు. మీరు ఈ వారం పనిని శాంతియుతంగా చేస్తూ ఉండాలి. వ్యాపారులు ఈ వారం మంచి ఫలాలను పొందవచ్చు. ఈ వారం లాక్ డౌన్ కారణంగా మీరు మీ కుటుంబసభ్యులను కలవలేరు. ఈ విషయం మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

లక్కీ కలర్: స్కై బ్లూ

లక్కీ నంబర్ : 9

లక్కీ డే : బుధవారం

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!చాణక్య నీతి : ఈ లక్షణాలుండే స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతే సంగతులట...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం దృష్టి అంతా ఆర్థిక పరిస్థితిపై ఉంటుంది. మీరు ఆర్థిక విషయాల ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు మీ ప్రణాళికలను కూడా మార్చవచ్చు. అయితే, ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి. మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు టీమ్ లీడ్ అయితే, మీకు సహోద్యోగులతో పాటు, అధికారులకు కూడా మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని గొడవలు ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు పెరగవచ్చు. ఆరోగ్య పరంగా మీరు నిర్లక్ష్యం చేస్తే, ఇబ్బందులు తప్పవు.

లక్కీ కలర్: గ్రీన్

లక్కీ నంబర్ : 26

లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కష్టపడి పని చేస్తారు. దీని వల్ల మీరు ఆశించిన విధంగా ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ వారం ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు తెలివిగా వాటిని ఎదుర్కొంటారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. మీరు ఇబ్బందుల్లో ఉంటే కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ పిల్లలపై కూడా శ్రద్ధ చూపగలరు. వారి విద్యలో ఏమైనా అడ్డంకులు ఉంటే, దాన్ని తొలగించడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది.

లక్కీ కలర్: ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఎలాంటి విషయాల్లో కూడా తొందరపడకూడదు. ఎందుకంటే ఈ వారం ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం వ్యాపారులు పనులు వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు తగిన ఫలితాలను ఇస్తుంది. ఈ వారం ఉద్యోగులు కొంత ఒత్తిడికి లోనవుతారు. అయితే సానుకూలంగా ఆలోచించడం వల్ల వాటిని అధిగమిస్తారు. మరోవైపు, జీవిత భాగస్వామితో మీ విభేదాలు పెరుగుతాయి. మీ ప్రియమైన వారిని విస్మరించే పొరపాటు చేయవద్దు. ప్రేమ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రియుడు / స్నేహితురాలితో ఈసారి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇతరుల సలహాలను పాటించొద్దు. సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇతరుల సలహాలు, సూచనలను పాటిస్తే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్: మెరూన్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారు ఈ వారం పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు. మీరు మరోసారి మానసికంగా బలంగా ఉంటారు. తల్లి లేదా తండ్రి నుండి ప్రయోజనం కూడా పొందుతారు. ఈ వారం మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని నిజంగా ప్రేమిస్తే, ప్రతికూల విషయాలను విస్మరించండి. ఆరోగ్య పరంగా ఈ వారం బాగుంటుంది.

లక్కీ కలర్: బ్రౌన్

లక్కీ నంబర్ : 21

లక్కీ డే : బుధవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ వారం మీరు ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఖర్చులను మీరే నియంత్రించుకోవాలి. లేదంటే పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే, మీరు మరింత కష్టపడాలి. ఉద్యోగులు ఈ వారం తమ యజమానుల గురించి సరిగ్గా ప్రవర్తించాలి. వ్యాపారులు ఈ వారం ఒత్తిడికి లోనవుతారు. అయితే ప్రతికూల పరిస్థితులలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. దీంతో ప్రతికూల పరిస్థితులలో మీ ధైర్యం పెరుగుతుంది. మరోవైపు ఆరోగ్య పరంగా ఈ వారం కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 49

లక్కీ డే : శుక్రవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పని మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీరు ఉద్యోగం చేస్తే, మీ సహోద్యోగులతో సఖ్యతగా నడుచుకోవాలి. వ్యాపారులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఐక్యత ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. ఆర్థిక పరంగా అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ వారం మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉంటారు.

లక్కీ కలర్: ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : ఆదివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు...

English summary

Weekly Rashi Phalalu for May 10 to May 16

In the year 2020, second week of May will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, May 10, 2020, 4:50 [IST]
Desktop Bottom Promotion