ఈ వారం మీ రాశి ఫలాలు మే 15 నుండి 21వ తేదీ వరకు..

రాశులను బట్టి వారి దిన, వార ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. పని పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

Weekly Rashi Phalalu for May 15 to May 21

ఈ వారం మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మరికొన్ని రాశుల వారికి కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మరియు అందమైన మలుపు ఉండొచ్చు. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. పని పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వారం మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. అయితే మీరు మరింత కష్టపడి పని చేయాలి. ఈ సమయంలో మీరు పెద్ద మార్పులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :20

లక్కీ డే : మంగళవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారు ఈ కాలంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం మానుకోవాలి. పని విషయంలో ఉద్యోగులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ఉన్నతాధికారులతో మీ సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మరియు అందమైన మలుపు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీరు ఈ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. ఈ కాలంలో మీకు అనవసర ఖర్చులు పెరగొచ్చు. మీరు మీ బడ్జెట్ ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : ఆదివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచి లాభాలను సంపాదించొచ్చు. ఉద్యోగులకు ఈ వారం కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం కోరుకున్న బదిలీని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు తల్లిదండ్రుల మనోభావాలను గౌరవించాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో పారదర్శకతను కొనసాగించాలి. మీ మనసులో ఏదైనా అనుమానాలుంటే, మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వారం చివర్లో మీకు కావాల్సిన డబ్బు పొందొచ్చు. పనికి సంబంధించి ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, రాబోయే రోజుల్లో మీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 26

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో, బాస్ మీ పనిని గమనించొచ్చు. మరోవైపు మీకు సహోద్యోగులతో గట్టి పోటీ పెరగొచ్చు. మరోవైపు ఈ వారం మీరు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. చిరు వ్యాపారులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకరితో ఒకరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : బుధవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారిలో గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది. మీరు రుణం తీసుకుంటే మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు వీలైనంత త్వరగా అప్పుల నుండి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులకు ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ డే : గురువారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వారంలోని ప్రారంభ రోజులలో, మీరు ఏదైనా పెద్ద విషయం గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు పెరుగుతాయి. ఈ కారణంగా మీరు పనిపై శ్రద్ధ పెట్టలేరు. మీ చిన్న పొరపాటు వల్ల మీ బాస్ కోపం పెరుగుతుంది. మీకు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా మీ నుండి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 42

లక్కీ డే : ఆదివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం ప్రస్తుత ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు సానుకూల ఫలితాలు రావొచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కార్యాలయంలో ఏదో ఒక కుట్రకు మీరు బలి కావొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 25

లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు బట్టలు, సౌందర్య సాధనాలు, స్టాక్ మార్కెట్ మొదలైన వాటికి సంబంధించిన పనులు చేస్తే, ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ కాలంలో ఎలాంటి మార్పుల గురించి ఆలోచించకండి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు గొప్ప అవకాశం వస్తుంది. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : బుధవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఇటీవల ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, మీరు క్యాంపెయిన్ పై ఫోకస్ పెట్టాలి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే, మీ సన్నిహితుల సంప్రదించిన తర్వాతే ముందడుగు వేయండి. ఆర్థిక పరంగా ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ పనిపై ఎక్కువ ద్రుష్టి పెట్టగలుగుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ కాలంలో మీరు విజయం పొందొచ్చు. వారం చివర్లో మీరు కోరుకున్న ఉద్యోగం పొందే బలమైన అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగులకు ఈ కాలంలో పురోగతి లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 19

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు, వ్యాపారులు ఈ వారం మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ వారం మీరు చాలా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ తెలివితేటలతో డబ్బు సంపాదించొచ్చు. వారం చివర్లో, కోర్టుకు సంబంధించిన పాత కేసు పరిష్కరించబడొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : ఆదివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

Story first published: Sunday, May 15, 2022, 7:00 [IST]
Desktop Bottom Promotion