Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ వారం మీ రాశి ఫలాలు 31 నుండి జూన్ 6వ తేదీ వరకు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి.

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ప్రత్యేకించి పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పనులను సకాలంలో పూర్తి చేయకపోతే, మీరు సీనియర్ల ఆగ్రహానికి కావాల్సి వస్తుంది. వారం చివర్లో మీకు కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే మీరు పెద్ద లాభం పొందడానికి కొత్తగా మరియు భిన్నంగా ఆలోచించాలి. మరోవైపు కుటుంబ వాతావరణం సరిగ్గా ఉండదు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఈ వారం ఆర్థిక భేరసారాలు కూడా చేయొచ్చు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 2
లక్కీ డే : మంగళవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ రాశి వారు ఈ వారం పని గురించి ఆందోళన చెందుతుంటే, కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మీరు నిరుద్యోగులై ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీకు శుభవార్త వినిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గానే ఉంటుంది. సరైన సమయానికి మీకు డబ్బు లభిస్తుంది. ఈ వారం మీరు శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 22
లక్కీ డే : గురువారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఉద్యోగులకు సీనియర్లతో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వ్యాపారులు ఈ వారం చిన్న ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ వారం మీరు సంక్లిష్టమైన వ్యాపార విషయాలకు సంబంధించి చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా ఈ వారం ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే చాలా పోరాటం తర్వాత, మీకు సరైన సమయంలో డబ్బు లభిస్తుంది. మరోవైపు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించకపోవచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 12
లక్కీ డే : సోమవారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపార ప్రతిపాదనను కూడా పొందొచ్చు. మీ ప్రాంతంలో మీకు గొప్ప పేరు ఉంటుంది. మరోవైపు, ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీరు వాటిని ఎదుర్కోగలిగితే మంచిది. అవి మిమ్మల్ని ఎక్కువగా పాడు చేయకపోయినా, మీ పనికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మరోవైపు ఉపాధి ప్రజల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయంలో సీనియర్ అధికారులతో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీకు త్వరలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వారం చివర్లో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. అయితే, ప్రస్తుత పరిస్థితిని బట్టి, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం ఒక సువర్ణావకాశం లభిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ డే : బుధవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురవుతాయి. దీన్ని భరించలేక మీరు మీ ఉద్యోగాన్ని మార్చాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, జాగ్రత్తగా తీసుకోండి. తొందర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారులు ఈ వారం ఎలాంటి కొత్త పని చేయకుండా ఉండాలి. ఈ వారం కుటుంబంతో సంబంధాలు సరిగ్గా ఉండవు. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 14
లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ వారం మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది. ఉద్యోగులకు ఈ వారం వారి ప్రతిభకు తగ్గ మంచి ఫలితాలు ఇంక్రిమెంట్ల రూపంలో పొందవచ్చు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు మరింత మంచి చేయడానికి ప్రేరేపించబడతారు. మీరు క్రొత్త ప్రాజెక్ట్‌లో పనిచేస్తుంటే, ఈ కాలంలో మీ పనితీరు ప్రశంసనీయంగా మారుతుంది. వ్యాపారులు కూడా లాభం పొందే అవకాశం పొందవచ్చు. మీరు అదృష్టవంతులు అవుతారు. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈ వారం ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబంతో గడపడానికి అవకాశం పొందుతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 35
లక్కీ డే : సోమవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారు ఈ వారం చాలా గందరగోళంగా ఉంటారు. ఇలాంటి సమయంలో అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. అయితే వ్యాపారులకు ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ వారం మీరు గణనీయమైన లాభం పొందుతారు. స్నేహితులతో చాలా సరదాగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఒక పెద్ద సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ రావచ్చు. అయితే మీరు గందరగోళంలో ఉండి, ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారులకు ఈ వారం ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. మీరు కోపంతో ఏదైనా పని చేస్తే, మీరు తప్పు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మీరు చాలా కాలం పాటు చట్టపరమైన విషయాలలో కూడా చిక్కుకోవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి, ఈ విషయాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తే మంచిది. మీరు అవివాహితులు మరియు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. మీ ప్రేమ సంబంధాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఈ వారం వివాహితులకు ఒత్తిడితో నిండి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 5
లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారిలో విద్యార్థులు ఈ వారం ధైర్యాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అయితే మీరు నిరుత్సాహపడకండి. కష్టపడి ప్రయత్నించండి.త్వరలో మీకు ఫలితం వస్తుంది. అదే సమయంలో, ఈ వారం వ్యాపారులకు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ అధికారుల కఠినమైన వైఖరి కలవరపెడుతుంది. ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే ఇది సరైన సమయం కాదు. అలాగే, ఆర్థిక విషయాలలో ఇతరులను ఎక్కువగా నమ్మవద్దు. కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బాగుంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారికి ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీరు ఎక్కువ సమయం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. కొన్ని రోజులుగా, పని ఒత్తిడి కారణంగా, మీరు మీ గురించి పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు, కాబట్టి మీరు ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా మీరు ఇంటి నుండి పని చేస్తుంటే, ఈ వారం మీరు కార్యాలయానికి వెళ్లడం ప్రారంభించవచ్చు. అయితే మీరు పూర్తి జాగ్రత్త తీసుకోవాలి. సామాజిక దూరాన్ని అనుసరించాలి. వ్యాపారులకు నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితం పొందకపోతే మీరు నిరాశ చెందకూడదు. మరోవైపు మీరు ఆశించిన ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందలేరు. అలాగే అనసవరమైన వాటికి డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 31
లక్కీ డే : శుక్రవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం సాధారణం కంటే మంచిగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ వారం మీకు పని భారం తేలికగా ఉంటుంది. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈ వారం ఉపశమనం లభించవచ్చు. మీ వ్యాపారం మరోసారి వేగంగా పెరుగుతుంది. మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 14
లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఈ వారం మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా కొన్ని నష్టాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 32
లక్కీ డే : బుధవారం
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











