For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పింక్ మూన్ 2020 : పింక్ సూపర్ మూన్ అంటే ఏమిటి? అది ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా?

అయితే మన దేశంలో ఇది కనిపించే అవకాశాలు తక్కువే అంటున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం...

|

మన దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో అనేక మంది ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. అందుకే అందరూ ఈ సూపర్ పింక్ మూన్ అందాలను ఆస్వాదించే పరిస్థితి ఉండకపోవచ్చు.

What is Super Pink Moon

ఎందుకంటే ఉదయం సమయంలో చంద్రుడు సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అమెరికాలో మాత్రం ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఈ అద్భుతమైన ద్రుశ్యాన్ని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ సూపర్ పింక్ మూన్ అంటే ఏమిటి? అది ఇప్పుడే ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

పింక్ సూపర్ మూన్ అంటే..

పింక్ సూపర్ మూన్ అంటే..

సాధారణంగా మన దేశంలో పౌర్ణమి వేళ కనిపించే చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా, సాధారణ రోజుల్లో కంటే, పెద్దగా ఆకాశవీధిలో అందాల జాబిలిలా కనువిందు చేస్తుంటాడు. అయితే అంతకంటే ప్రకాశవంతంగా, దానికన్నా భారీ ఆకారంలో కనిపించే మూన్ సూపర్ పింక్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు.

పెరోజీలోకి వచ్చినప్పుడు..

పెరోజీలోకి వచ్చినప్పుడు..

ఈ పెరోజీలోకి వచ్చినప్పుడు చంద్రుడు భారీగా, మరింత ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు మూడు లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం ఉంటుది. అయితే ఏప్రిల్ 7, 8వ తేదీలలో మాత్రం ఆ దూరం 3 లక్షల 56 వేల కిలోమీటర్లకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పౌర్ణమి నాడు..

పౌర్ణమి నాడు..

దీని ఫలితంగానే పౌర్ణమి వేళ కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించి సూపర్ పింక్ మూన్ లా దర్శనమిస్తాడట. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్ లు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుందట. ఈ సంవత్సరం కూడా నెలలో ఒక సూపర్ మూన్ వచ్చే అవకాశముందట.

2016 నుండి..

2016 నుండి..

ఈ ‘సూపర్ మూన్‘ అనే పదం 40 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ 2016 సంవత్సరంలో మూడు సూపర్ మూన్లు కనిపించేసరికి దీనికి ప్రజాదరణ బాగా పెరిగింది. ఇది ఎక్కువగా వసంత కాలంలో అది కూడా ఏప్రిల్ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది.

పింక్ కలర్ కు సంబంధం లేదు..

పింక్ కలర్ కు సంబంధం లేదు..

ఉత్తర అమెరికాలో ముందుగా కనిపించే ఈ సూపర్ మూన్ ను ‘పింక్ మూన్‘ లేదా ‘సూపర్ పింక్ మూన్‘ అని అంటారు. అయితే ఈ పేరుకు సూపర్ మూన్ రంగుకు ఎలాంటి సంబంధం లేదు.

English summary

What is Super Pink Moon and What Does It Mean in Telugu

Whenever the full moon is closest to earth on the full moon day, it is known as Supermoon. This happens only when the full moon comes nearer to earth through its orbit.
Desktop Bottom Promotion