Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఈ రాశుల వారు షేర్ మార్కెట్‌లో రాణించగలరు, వారెవరంటే..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు షేర్ మార్కెట్, జూదం లాంటి వాటిలో డబ్బు పెడితే లాభపడతారు. కొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోతారు. ఏయే రాశుల వారు షేర్ మార్కెట్‌లో డబ్బు సంపాదించగలరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి జీవితంలో సంపదకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంపదను సృష్టించాలని కోరుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అవకాశాలు వచ్చే దాకా వాటి కోసం ఎదురుచూడటం వచ్చిన తర్వాత వాటిని అందిపుచ్చుకోవడం కాదు, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు ఇప్పటి జనరేషన్ కుర్రకారు. అలా ఈమధ్య స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం కూడా పెరిగిపోయింది. షేర్ మార్కెట్‌లో పెట్టిన డబ్బు వెనక్కి వస్తుందని చెప్పలేం. అది కొంత నాలెడ్జీ, కొంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే షేర్ మార్కెట్‌ను కూడా జూదంతో పోలుస్తుంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు షేర్ మార్కెట్, జూదం లాంటి వాటిలో డబ్బు పెడితే లాభపడతారు. కొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోతారు. ఏయే రాశుల వారు షేర్ మార్కెట్‌లో డబ్బు సంపాదించగలరో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
సంపదకు అధిపతి అంగారకుడు. మేషరాశిలో అంగారకుడికి గొప్ప స్థానం ఉంటుంది. మేషరాశిలో తెలివితేటలు, నైపుణ్యం, నాయకత్వ లక్షణాల ద్వారా డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఇంట్రాడే కోసం స్టాక్ మార్కెట్ ద్వారా మేషరాశి వారు సంపదను ఆర్జిస్తారు.

వృషభరాశి:
వృషభ రాశి వారికి శుక్రుడు ఆధిపత్య గ్రహం. మీకు జీవితంలో మంచి ఆర్థిక సంపదను అందిస్తుంది. వృషభ రాశిలో సంపదపై సానుకూల ప్రభావం ఉంటుంది. వృషభరాశి వారు షేర్ మార్కెట్లలో డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వృశ్చిరాశి:
వృశ్చిక రాశి వారి ఆధిపతి కుజుడు. పెట్టుబడులు, డబ్బు సంపాదించడంలో కుజుడు మంచి ప్రభావం చూపిస్తాడు. స్టాక్ మార్కెట్ల నుండి వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి తెలివితేటల వల్ల వృశ్చిక రాశి వారు సంపద సృష్టిస్తారు.

ధనుస్సురాశి:
ధనుస్సు రాశి వారి అధిపతి బృహస్పతి. బృహస్పతిని సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. ధనుస్సు రాశి వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. డబ్బు సంపాదించే అత్యంత అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటారు. బృహస్పతి గ్రహం ద్వారా, స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం ఉంటుంది. కానీ ఇంట్రాడేలో మాత్రం నష్టాలు చూస్తారు.

మీనరాశి:
మీనరాశి వారు షేర్ మార్కెట్ల నుండి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్రాడేలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితంలో లక్ష్యాలను చేరుకుంటారు. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ వల్ల మీనరాశి వారు ఒత్తిడి ఎదుర్కొంటారు. లాంగ్ టర్మ్ స్టాక్స్ లో పెట్టుబడి పెడితే మంచి ఫలితం ఉంటుంది.
షేర్ మార్కెట్ అంటే కొంత జ్ఞానం, కొంత అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే సముద్రం వంటిది. దాని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టేముందు ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కంపెనీ స్థితిగతులు, వాటి భవిష్యత్తు లక్ష్యాలు, ఆ లక్ష్యాలను చేరుకునేందుకు అవలంభించే పద్ధతులు, తీసుకోబోయే నిర్ణయాలను అన్నింటిని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
