Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
International Womens Day 2023: నాగాలాండ్‌లో తొలి మహిళ ఎమ్మెల్యేలు, ఒకే పార్టీ నుండి జయకేతనం, ఎవరంటే?
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొంది ఇప్పటిక 60 ఏళ్లు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నికవ్వలేదు. ఇప్పుడు హెకాని జఖాలు, సల్హౌతునో క్రుసె అనే ఇద్దరు మహిళలు తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొంది ఇప్పటిక 60 ఏళ్లు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నికవ్వలేదు. ఇప్పుడు హెకాని జఖాలు, సల్హౌతునో క్రుసె అనే ఇద్దరు మహిళలు తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేలుగా నిలిచారు.

దిమాపుర్ నుండి హెకానీ, పశ్చిమ అంగామీ నుండి క్రుసె విజయం సాధించారు. వీరిద్దరూ నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ-NDPP అభ్యర్థులే కావడం విశేషం. హెకానీ 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా.. క్రుసె 7 ఓట్లతో జయకేతనం ఎగురవేశారు.

హెకాని జఖాలు ఎవరు?
హెకాని జఖాలు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుండి లా చదివారు. ఆ తర్వాత కొంత కాలం పాటు అమెరికాలోనే పని చేశారు. అనంతరం దిల్లీకి వచ్చి, న్యాయవాదిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత తన స్వరాష్ట్రం నాగాలాండ్ కు వెళ్లిపోయారు. యూత్ నెట్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు హెకాని జఖాలు.
యూత్ నెట్ ద్వారా యువతకు వివిధ అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని ద్వారా 23,500 మంది లబ్ధి పొందారు. యువత, మహిళ సాధికారత కోసం హెకాని జఖాలు ఎంతో కృషి చేశారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో నారీ శక్తి పురస్కారం ఇచ్చి గౌరవించింది.

సల్హౌతునో క్రుసె ఎవరు?
- సల్హౌతునో క్రుసె ఒక హోటల్ యజమాని.
- నాగాలాండ్ ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో 56 ఏళ్ల క్రుసె ఒకరు.
- సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లో చురుకునై సభ్యురాలిగా ఉన్నారు.
- పలు స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేశారు.
- స్థానిక అంగమిమియాప్ఫు మెచు క్రోతో అనే స్థానిక తెగ మహిళలకు నాయకత్వం వహించారు.
- సల్హౌతునో క్రుసెకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో మద్దతు ఇచ్చారు.
- స్వతంత్ర అభ్యర్థి కెనీఝాఖో నఖ్రోపై క్రుసె పోటీ చేశారు. నఖ్రోకు 7071 ఓట్లు రాగా, క్రుసెకు 7078 ఓట్లు వచ్చాయి.
1963 సంవత్సరంలో నాగాలాండ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుండి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. నాగాలాండ్ లో మొత్తం 13.17 లక్షల ఓట్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లే 6.56 లక్షల మంది ఉంటారు. ఇప్పటి వరకు 20 మంది మహిళలు పోటీ చేసినప్పటికీ వారెవరు గెలుపొందలేరు.



Click it and Unblock the Notifications