Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
ఈ 5 రాశుల వారు ఎల్లప్పుడూ మాట నిలబెట్టుకుంటారట... ఈ లిస్టులో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
ఈ 5 రాశుల వారు కచ్చితంగా ప్రామిస్ ను నిలబెట్టుకుంటారట...
ఒకప్పుడు ఎవరైనా ఏదైనా విషయంలో వాగ్దానం చేసినా లేదా దేని గురించైనా ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయేంత వాటిని నిలబెట్టుకునేవారు. అంతేకాదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నం చేసేవారు.

అయితే ప్రస్తుతం ఉన్న వారిలో వాగ్దానాలు చేసేవారు కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ.. వాటిని నిలబెట్టుకునే వారిని మాత్రం కేవలం చేతివేళ్లపై లెక్కించాల్సిందే. ఎందుకంటే చాలా మంది తమ వాగ్దానాల విషయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పడమే తప్ప వాటిని ఏ మాత్రం పట్టించుకోరు.

అసలు తామెందుకు ఇలాంటి వాగ్దానం ఇస్తున్నాం.. అసలు అది సాధ్యమయ్యేదా అనే విషయాల్ని కూడా కనీసం పట్టించుకోరు. ఇలాంటి అనూహ్యమన ప్రవర్తనలు అందరిలో గందరగోళాన్ని ఏర్పరుస్తాయి. అంతేకాదు చాలా మందికి అవాంతరాలు కూడా వస్తుంటాయి.

ఎవరైనా వ్యక్తి ఏదైనా విషయంలో ఒక మాట లేదా హామీ ఇస్తే..దాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనే దానిని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి వారిని ఇట్టే గుర్తు పట్టేయొచ్చట. రాశిచక్రాలను బట్టి వారు వాగ్దానాల విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చట. నిజంగా ఇది ఒక అద్భుతమే కదా.. ఇంకెందుకు ఆలస్యం ఆ రాశి చక్రాల వారెవరో.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి మరి...

కర్కాటక రాశి..
ఈ రాశి వారు అందరి నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరు తమ మాట నిలబెట్టుకునేందుకు చాలా ప్రణాళికలు రూపొందిస్తారు. అంతేకాదు ఏవైనా హామీలిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వీరు ఎవరికైనా ఏదైనా విషయంలో ప్రమాణం చేస్తే.. దాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. అంతేకానీ వీరు ఎప్పటికీ వెనుకడుగు అనేదే వేయరు. వీరు క్లిష్ట పరిస్థితులలో ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ఎవరికైనా.. ఏదైనా హామీ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముందుగా పరిస్థితులను అంచనా వేస్తారు. వారు ఏదైనా హామీ ఇవ్వబోతున్నట్లయితే.. ముందుగానే దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే వీరు ఎవరికైనా ఏదైనా హామీ ఇస్తే, దాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పటికీ ముందుంటారు. అంతేకానీ ఎప్పటికీ హామీ గురించి ఏ మాత్రం ఆందోళన చెందరు. ఒకవేళ వీరు సహజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే.. వాగ్దానాలను కట్టుబడి లేకపోతే.. చాలా అవమానంగా ఫీలవుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారి తమ వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరు ఇతరుల ప్రతిష్టను దెబ్బ తీయకుండా ఉంటారు. అదే విధంగా వాగ్దానాల విషయంలో కూడా వీరు చాలా అప్రమత్తంగా ఉంటారు. వీరు ఏదైనా విషయంలో హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తమ వల్ల ఏ పని అయినా కాదనుకుంటే.. తమను ఎవరు ఏమి అనుకున్నా సరే అస్సలు సహాయం అనేది చేయరు. ఇందుకోసం తమను చెడు వ్యక్తులనుకున్నా పర్వాలేదనుకుంటారు. అయితే వీరు తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా.. తమ ప్రతిష్టను కొనసాగించేందుకు మాత్రం కొన్ని వాగ్దానాలను చేస్తారు. అంతేకాదు వాటిని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి జాలి, దయ, కోపం అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీరు ఇతరుల భావాలను బాధపెట్టడం అనే విషయాలకు చాలా దూరంగా ఉంటారు. అలాగే వీరు ఎవరికైనా ఏదైనా విషయంలో వాగ్దానం చేస్తే, దాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీరు ఏదైనా అనుకోని కారణాల వల్ల తమ మాటను నిలబెట్టుకోకపోతే.. దాన్ని అవమానంగా ఫీలవుతారు. వీరు ఇతరులతో స్నేహపూర్వక మరియు మంచి అవగాహన కలిగి ఉంటారు.

మకర రాశి..
ఈ రాశి వారు తమ బాధ్యతను వందశాతం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఏదైనా విషయంలో ఎవరికైనా ఏమైనా వాగ్దానం ఇస్తే, అందుకనుగుణంగా జీవించేందుకు ప్రయత్నిస్తారు. వీరు విలువలు మరియు కట్టుబాట్లకు చాలా విలువనిస్తారు. అంతేకాదు వీరు ఏదైనా విషయంలో, ఎవరికైనా హామీ ఇస్తే, దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరు కొన్నిసార్లు బెదిరింపు ధోరణిని కలిగి ఉంటారు. ఇలాంటి సమయంలో వీరితో జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications
