Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
గుళ్లోకి వెళ్లే ముందు మెట్లను తాకి ఎందుకు మొక్కుతారో తెలుసా?
అన్నింటికంటే మొదట గుళ్లోకి వెళ్లే ముందు చాలా మంది మెట్లకు, గడపకు నమస్కరిస్తారు. అసలు ఇలా మెట్లకు ఎందుకు నమస్కరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయంలోకి వెళ్లే ముందు మెట్లను తాకి నమస్కరిస్తారు. లోపలికి వెళ్లిన తర్వాత గంట మోగిస్తారు. మహిళలు కొంగు సరిచేసుకుంటారు. మరికొందరు ఆ కొంగును నొత్తిపై వేసుకుంటారు. ఇవన్నీ చాలా రోజుల నుండి వస్తున్న ఆచారాలు, నియమాలు. ఇందులో చాలా వాటి గురించి మనకు తెలియదు. అయినా పెద్దలను చూసి ఫాలో అయిపోతున్నాం.

అన్నింటికంటే మొదట గుళ్లోకి వెళ్లే ముందు చాలా మంది మెట్లకు, గడపకు నమస్కరిస్తారు. అసలు ఇలా మెట్లకు ఎందుకు నమస్కరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

గౌరవించడం:
హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు, గురువులకు, పెద్ద వారికి కాళ్లకు నమస్కరిస్తాం. పాదాలను తాకి మొక్కుతుంటాం. అది గౌరవం ఇవ్వడం. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం మెట్లకు నమస్కరించడం అంటే దేవుడిని గౌవించినట్లు అవుతుంది.
గుడి మెట్లను తాకినప్పుడు, మనలోని చెడును ఆలయం బయటే వదిలి స్వచ్ఛమైన మనస్సుతో లోపలికి ప్రవేశిస్తాం.

అహం నాశనం అవుతుంది:
గుడి మెట్లను తాకడం ద్వారా మనలోని అహంకారమంతా అంతమైపోతుంది. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనస్సులో ఏదైనా గర్వం ఉంటే దేవుడిని పూజించడం ద్వారా వచ్చిన ఫలాలను పొందలేరు. కాబట్టి ప్రవేశ ద్వారా వద్ద ఉన్న మెట్లకు నమస్కరించాలని పెద్దలుస సూచిస్తారు. నమస్కరించి మెట్లను తాకడం వల్ల అహంకారం నశించి మనస్సు తేటతెల్లమై జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది.

దేవుడిని ప్రార్థించే విధానం:
మనం గుడి అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించడానికి మెట్లే మార్గం. మెట్లను తాకి నమస్కరించినప్పుడు మన కోరికలు ఏవైనా నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చూపుతుందని నమ్ముతారు. భగవంతునితో అనుసంధానించడానికి ఇదే మార్గం. దీని ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.

మనస్సు అర్పించడం:
ఆలయంలోకి ప్రవేశించే ముందు మెట్ల ముందు వంగి, మెట్ల పాదాలను తాకినప్పుడు అది మనస్సును అర్పించడాన్ని సూచిస్తుంది. గుడిలోకి ప్రవేశించే ముందు కూడా మీ ఆత్మ, శరీరం భగవంతునికి సమస్తాన్ని అర్పించుకుంటాయి.
శరణాగతి భావన కోరికలను నెరవేర్చడానికి, పూజల ఫలితాన్ని పొందాలని భగవంతుడికి సందేశాన్ని అందజేస్తుంది. ఎప్పుడైతే భగవంతుని భక్తిలో సమస్తాన్ని త్యాగం చేశామో అప్పుడు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

ఆలయ మెట్లు ఏం చెబుతాయి:
గ్రంథాల ప్రకారం ఆలయం ద్వారా వద్ద ఉండే మొదటి మెట్టు మాత్రమే ప్రధాన ఆలయానికి, విగ్రహాలకు కలుపుతుంది. హిందూ దేవాలయాల మెట్లపై దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఇది పూజను ప్రారంభించడానికి మొదటి మొట్టుగా పరిగణించబడుతోంది.

ఆలయంలోకి ప్రవేశించడానికి ఇతర నియమాలు:
ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, మెట్లను తాకి నమస్కరించడంతోపాటు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆలయంలోకి చెప్పులు లేకుండా వెళ్లాలి. కాళ్లు కడుక్కోవడం ద్వారా శుభ్రమైన కాళ్లతో ఆలయంలోకి ప్రవేశించాలి. గుళ్లోకి వెళ్లిన తర్వాత గంట మోగించాలి. కొన్ని సాంప్రదాయాల్లో మహిళలు తమ జుట్టును కొంగుతో కప్పుకుంటారు. గుడిలోకి వెళ్లిన తర్వాత బొట్టు పెట్టుకుని దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాలి.
చాలా ఆలయాల్లో గర్భ గుడిలోకి ప్రవేశం ఉండదు. ఒకవేళ గర్భ గుడిలోకి వెళ్లగలిగితే ఆ సమయంలో ఉతికి బట్టలు వేసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి. దైవ నామ స్మరణ, మంత్ర పఠనం చేస్తుండాలి. గుడిలో ఉన్నంత సేపు మనస్సును దేవుడిపై ఉండేలా చూసుకోవాలి. మంత్ర పఠనం వల్ల మనస్సును దేవుడిపైనే ఉంచవచ్చు.
దైవ నామ స్మరణ వల్ల మనస్సును దేవునిపైనే లఘ్నం చేయవచ్చు.



Click it and Unblock the Notifications
