Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
World tsunami day 2020 : సునామీ ఎందుకొస్తుంది... ఇది ఎన్ని ఆటంబాంబులకు సమానమో తెలుసా..!
వరల్డ్ సునామీ గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.
జపాన్ దేశ సూచనతో ఐక్యరాజ్య సమితి 2015 డిసెంబరులో ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీన 'ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని' నిర్వహించాలని నిర్ణయించింది. దీని ఉద్దేశ్యం ప్రతి ఒక్కరూ సునామీపై అవగాహన పెంచుకుని మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి వినూత్న విధానాలను పంచుకోవడం.

ఆ తర్వాత 2016 సంవత్సరం నుండి ఐక్యరాజ్యసమితి కార్యాలయం డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెండై సెవెన్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. విపత్తుల వేళ భయం తగ్గించడం.. మరియు విపత్తు నష్టాలను తగ్గించడం కోసం అన్ని రంగాలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో సునామీ అంటే ఏమిటి? అసలు సునామీ ఎందుకు వస్తుంది.. సునామీ ఎన్ని రకాలుగా ఉంటుంది.. సునామీ వల్ల ఎవరెవరు నష్టపోతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగు రకాలు..
- సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది.
- సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు.
- కొండ చరియలు విరిగి సముద్రంలో పడినప్పుడు.
- అగ్నిపర్వతాలు బద్ధలైనప్పుడు
- ఉల్కాపాతం సంభవించినప్పుడు(అత్యంత అరుదైన సందర్భాల్లో) సునామీలు వస్తుంటాయి.

సునామీ ఎక్కడి నుండి..
సునామీ అన్న పదం జపనీస్ భాషకు చెందినది. సునామీ అంటే హార్బర్ కెరటం అని దీని అర్థం. సముద్రంలో సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయి. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తుంటాయి. సునామీ అలలు గంటకి 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక జెట్ విమానం స్పీడ్ తో సమానంగా ఉంటుంది.

ఎవరికి ఎక్కువ ముప్పు..
ఈ విశ్వంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా వంటి ప్రాంతాలకు సునామీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిలో హవాయి దీవులకు తీవ్రమైన ముప్పు ఉంటుందట. ఇక్కడ ప్రతి సంవత్సరం సునామీ వస్తుందట. ఏడేళ్లకొకసారి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది.

ఇప్పటివరకు..
ఇప్పటివరకు వచ్చిన సునామీలలో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇండోనేషియా కేంద్రంగా సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం అంట. సముద్రంలో వచ్చిన భూకంపంతో రాకాసి అలలు ఏకంగా ఆకాశమంత ఎత్తుకు చేరి ముంచేశాయట. 2 లక్షల 83 వేల మందిని పొట్టనబెట్టుకున్నాయట.



Click it and Unblock the Notifications