Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ఈ రాశుల వారు ఎక్కువగా పుస్తకాలను ప్రేమిస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
ఈ రాశుల వారు ఎల్లప్పుడూ పుస్తకాల చుట్టూ పురుగులా మునిగిపోతారంట...
మనలో చాలా మంది ఖాళీ సమయాల్లో షాపింగ్ చేయడానికి లేదా ఏదైనా మూవీకో, ఏ పార్కుకో వెళ్లాలని అనుకుంటూ ఉంటాం. మరీ కాస్త ఎక్కువ టైమ్ దొరికితే ఏ టూర్ కు వెళ్లడమో.. లాంగ్ డ్రైవ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడమో చేస్తుంటాం.

ఇంకా కొందరైతే పార్టీలు చేసుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే అతి కొద్ది మాత్రం పుస్తకాలతో సమయం గడిపేయాలని అనుకుంటారట. అంతేకాదండోయ్ వారి ఇంటినే ఓ గ్రంథాలయంగా మార్చేస్తారట.

ఖాళీ సమయాల్లో తమ అభిమాన పుస్తకాలను చదవడం వంటివి చేస్తుంటారు. వీరు నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం మరియు చదవడాన్ని బాగా ఇష్టపడతారట. ఇతర పనులకన్నా ఇలాంటి వాటినే ఎక్కువగా ఇష్టపడతారట.

అంతేకాదండోయ్ వీరు ఏదైనా విషయంపై అధ్యయనం చేయడాన్ని ఆనందంగా భావిస్తారట. ఇలాంటి వారందరినీ మనం పుస్తకాల పురుగులు అని పిలుస్తూ ఉంటాం. అయితే అలాంటి వారిని మనం గుర్తు పట్టాలంటే కొంచెం కష్టమే. అయితే దీనికి జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. మీ రాశిచక్రాలు, గ్రహాల కదలికను బట్టి ఏ రాశి వారు పుస్తక పఠనాన్ని ఎక్కువగా ఇష్టపడతారనే విషయాలను మనం సులభంగా తెలుసుకోవచ్చట. ఇంకెందుకు ఆలస్యం.. ఆ రాశి చక్రాల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి...

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా తెలివిగలవారు. వీరు నిత్యం పుస్తకాలను చదవడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవచ్చని.. ప్రతి పుస్తకం నుండి కొంత జ్ణానం పొందొచ్చని భావిస్తారు. అందుకే వీరు అనునిత్యం పుస్తకాలతో అనుబంధం పెంచుకోవడాన్ని బాగా ఇష్టపడతారట.

కన్య రాశి..
ఈ రాశి వారు ‘పుస్తకాల పురుగు' అనే పదానికి పర్యాయపదం అని చెప్పొచ్చు. వీరు ఖాళీ సమయాల్లో ఎక్కువగా పుస్తక పఠనం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అంతేకాదు వీరు ఎక్కువ ఆనందంగా ఉంటారు. అంతేకాదు వీరు కొత్త పుస్తకాలను ఎల్లప్పుడూ తమకు బహుమానంగా ఇవ్వాలని ఆశిస్తుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు సామాన్యంగా ఎక్కువగా చదవడానికి ఇష్టపడరు. కానీ వీరు ఎక్కడైనా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం కష్టమని భావించినప్పుడు లేదా బస్సులోగానీ, కారులో గానీ, రైలులో గానీ.. విమానంలో గానీ ఇతర వాహానాల్లో లాంగ్ జర్నీచేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పుస్తకాలను ఓపెన్ చేస్తారంట. అంతేకాదు ఏదైనా విషయం గురించి అధ్యయనం చేసేటప్పుడు కూడా చాలా అంకిత భావంతో పుస్తక పఠనం చేస్తారంట. అందుకే ఈ రాశి వారు తమ చదువుల విషయంలో ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటారు.

మకర రాశి..
ఈ రాశి వారు చదువుకోవడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు సాధారణ మనుషులతో పోలిస్తే, చాలా భిన్నంగా మరియు ఆశ్చర్యకరంగా ఉండటానికి ఇష్టపడతారు. నలుగురికి నచ్చిన విషయాలను వీరు చాలా లైట్ తీసుకుంటారు. ఆ నలుగురిలో వీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఏదైనా పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తే.. అది పూర్తయ్యే నిద్రపోరట.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఏదైనా విషయం గురించి ఒక స్పష్టత కోసం మరియు అందులోని విషయాన్ని అవగాహన చేసేందుకు పుస్తకాలను తెరుస్తారు. అంతేకాదు వీరు కూడా పుస్తకాలను చదవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలని భావిస్తారు. అందుకే వీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications