Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
ఎండ వేడికి కరిగిన రైలు పట్టాలు, యూపీలో తప్పిన ఘోర ప్రమాదం
ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ నెల వచ్చినా మే నెలలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి ఎండల తీవ్రత తగ్గుతుంది. కానీ ఈ ఏడాది భానుడి ప్రతాపం మామూలుగా లేదు. అసలు ఎండాకాలంలో ఎడతెరిపిలేని వానలతో వర్షాకాలమా అనిపించింది. ఇప్పుడు మాత్రం ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రమైన వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తాజాగా ఈ ఎండల ధాటికి ఏకంగా రైల్వే ట్రాక్ కరిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్ లైన్ లోని రైల్వే ట్రాక్ లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్ లైన్ లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో లూప్ లైన్ పై నీలాంచల్ ఎక్స్ ప్రెస్ వెళ్లింది. ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించి వంకరగా మారిపోయాయి. ఈ క్రమంలో రైలు పట్టాలు జరగడం గమనించిన నీలాంచల్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు. స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి కరిగిపోయిన పట్టాల మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా అలెర్ట్ చేశారు.
రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని.. రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు. లూప్ లైన్ ను సాధ్యమైనంత త్వరగా సరిచేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. అయితే ట్రాక్ లను సరిగ్గా నిర్వహించని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేష్ సప్రా అనుమానం వ్యక్తం చేశారు.
హీట్‌వేవ్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
1. హైడ్రేటెడ్ గా ఉండాలి:
పుష్కలంగా నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం ఎక్కువగా నీరు కోల్పోతుంది. శరీరం నుండి కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పుష్కలంగా నీరు తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండాలి. అలాగే సీజనల్ ఫ్రూట్స్ తినాలి. పుచ్చకాయ, నారింజ్ లాంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండొచ్చు.
2. తేలికపాటి భోజనం:
ఎండాకాలంలో ముఖ్యంగా హీట్ వేవ్ సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఘన పదార్థల కంటే ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, వేపుళ్లు, ఫ్రైలు, సాల్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.
3. నీడ పట్టున ఉండాలి:
వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి. నేరుగా సూర్య కిరణాలు పడటాన్ని నివారించాలి. సూర్య కిరణాలు నేరుగా పడటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
4. వదులైన దుస్తులు ధరించాలి:
వేసవి కాలంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. అలాగే లేత రంగు దుస్తులు వేడిమిని ఆకట్టుకోవు.
5. సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి:
SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. దీని వల్ల చర్మంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా అడ్డుకుంటుంది.
6. పార్క్ చేసిన కార్లలో ఉండొద్దు:
ఎండలో కార్లను పార్క్ చేసి అందులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎండ వేడిమికి కారు లోపల వేడెక్కి పోతుంది. కాబట్టి ఇలా పార్క్ చేసిన కార్లలో ఉండటం ప్రాణాంతకం కావొచ్చు.
7. మద్యం సేవించొద్దు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. వేసవిలో పగటి పూట ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications