Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
మెగా వారసురాలు వచ్చేసింది.. సంబరాల్లో మెగా కుటుంబం, ఫ్యాన్స్
మెగా కుటుంబం మూడోతరానికి వెల్కమ్ చెప్పింది. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. రీసెంట్ గానే రామ్ చరణ్, ఉపాసన తమ 11వ పెళ్లిరోజున సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. పాప పుట్టిన విషయం తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మెగా కుటుంబంలో, మెగా ఫ్యాన్స్ లో సంబరాలు మిన్నంటాయి. మెగా ఫ్యాన్స్ అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు.

ఉపాసన డెలివరీ కోసం సోమవారమే ఆస్పత్రకి చేరుకున్నారు. ఆమె వెంట రామ్ చరణ్, సురేఖ (చిరంజీవి సతీమణి) కూడా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి రామ్ చరణ్ షూటింగ్స్ కూడా గ్యాప్ ఇచ్చి ఉపాసన వెంటే ఉంటున్నారు. ఆగస్టు వరకు షూటింగ్స్ లో పాల్గొనడని తెలుస్తోంది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత చరణ్ అండ్ ఉపాసన చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నట్లు ఉపాసన ఇంటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. తాత, నానమ్మ (చిరంజీవి, సురేఖ) సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఆ ఇంటర్వ్యూలో ఉపాసన పేర్కొంది.
రామ్ చరణ్, ఉపాసనకు 2012 లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అంటే పెళ్లైన 11 ఏళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు. అయితే పెళ్లైన కొత్తలోనే ఎగ్ ఫ్రీజ్ చేశామని ఇటీవలె ఉపాసన వెల్లడించిన విషయం తెలిసిందే.
'పిల్లలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నాం'
పెళ్లికి ముందే ఉపాసన, రామ్ చరణ్ మంచి స్నేహితులు. పెళ్లిన తర్వాత పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనే విషయంలో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉపాసన తెలిపింది. పెళ్లైన కొత్తలోనే తన ఎగ్స్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకుని ఎగ్స్ ను భద్రపరిచినట్లు చెప్పింది. ఎగ్స్ ఫ్రీజ్ చేయాలన్న నిర్ణయం వెనక అసలు కారణాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది.
'స్థిరపడ్డాకే పిల్లలు కావాలనుకున్నాం'
2012 లో వివాహం అయ్యాక కొత్తలోనే పిల్లల విషయంలో ఇద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది ఉపాసన. అందుకోసం ఎగ్స్ ఫ్రీజ్ చేయాలనుకున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఆ సమయంలో ఇద్దరం తమ తమ కెరీర్ లపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించినట్లు తెలిపింది. జీవితంలో స్థిర పడాలని, మంచి సంపాదన తర్వాతే పిల్లలు కనాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం ఇద్దరం ఎవరి ఫీల్డ్ లో వారు మంచి స్థానంలో ఉన్నామని, మంచి సంపాదన కూడా ఉండటంతో పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమనే నమ్మకం వచ్చిందని చెప్పుకొచ్చింది ఉపాసన. అలా పెళ్లైన దశాబ్దం తర్వాత గర్భం దాల్చినట్లు వివరించింది.
25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు
రూ. 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు
మత్తు ఇస్తారు కాబట్టి నొప్పిగా ఉండదు
35 ఏళ్ల లోపు వారు కనీసం 20 మెచ్యూర్ ఎగ్స్ ను ఫ్రీజ్ చేయాలని వైద్యులు సూచిస్తారు.
ఎగ్ ఫ్రీజింగ్ సహజ గర్భాధారణపై ఎలాంటి ప్రభావం చూపదు
ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే పీరియడ్స్ రావడం ఆగిపోవు



Click it and Unblock the Notifications











