Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఢిల్లీలో తొక్కిసలాట కారణం అదే.. అఫీషియల్‌గా ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే?
దేశ రాజధాని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే వందలాది మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాజ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ ప్లాట్‌ఫాంపై ఉండగా, కుంభమేళా కోసం వచ్చే భక్తులు అక్కడ చేరుకున్నారు. అదే సమయంలో, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం అయ్యాయి.

దీంతో ప్లాట్‌ఫాం 12, 13, 14 కూడా నిండిపోయాయి. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పదుల సంఖ్యలో మందికి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మరియు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఘటనలో మృతులు సంభవించాయని ధ్రువీకరించారు. రైల్వే ప్రాధికారులు, ఈ రద్దీని ముందుగానే అంచనా వేశామని చెప్పారు, కానీ ఈ ఘటన క్షణాల్లో జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై విస్తృత విచారణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications