ఫ్లై దుబాయ్‌ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.?

ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ పైలట్‌పై జరిగిన దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు సందేహాలను లేవనెత్తుతున్నాయి. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంది, ఇద్దరు పైలట్లు ఏం చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో క్రాష్ యాక్స్, టూ-పర్సన్ రూల్ గురించి సమగ్రంగా తెలుసుకుందాం..

Reasons behind crash axe in cockpit know the reasons behind fly dubai incident

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ FZ1073 కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటన విమాన భద్రతపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై అతని కో-పైలట్ దాడి చేయడంతో.. ఆ విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో, కెప్టెన్‌పై గొడ్డలితో దాడి జరిగిందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో చెప్పగా.. కత్తితో కూడా దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

కాక్‌పిట్‌లో గొడ్డలిని ఎందుకుంటుంది.?

కాక్‌పిట్‌లోని గొడ్డలిని సాధారణంగా క్రాష్ యాక్స్ లేదా ఫైర్ యాక్స్ అని అంటారు. అయితే ఇలా గొడ్డలి ఉంచడం వెనుక కారణం ఒక వ్యక్తిపై దాడి చేయడం కాదు. తీవ్రమైన అత్యవసర పరిస్థితిలో రక్షించేందుకు ఈ క్రాష్‌ యాక్స్‌ను ఉంచుతారు. విమానం కాక్‌పిట్‌లోని అత్యవసర పరికరాల్లో క్రాష్ యాక్స్‌ కూడా ఒకటిగా FAA పత్రాలు సైతం పేర్కొంటున్నాయి. ప్రమాదం తర్వాత ప్యానెల్ లేదా డోర్‌ ఇరుక్కుపోయినప్పుడు, మూసి ఉన్న ప్రదేశంలో పొగ లేదా మంటలు వ్యాపించినప్పుడు, లేదా ఎగ్జిట్‌ డోర్‌ మూసుకుపోయినప్పుడు రక్షణ కోసం దీనిని ఉపయోగించే సదుపాయం ఉంది.

ఈ క్రాష్ యాక్స్ ఎక్కడ ఉంచాలి?

విమానం మోడల్‌, ఆపరేటర్‌ సెటప్‌, సంఖ్య ఆధారంగా క్రాష్‌ యాక్స్‌ను ఖచ్చితమైన స్థానంలో ఉంచుతారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సిబ్బంది దీనిని తీసుకునేందుకు వీలుగా కాక్‌పిట్‌లో పొందుపరుస్తారు. కాక్‌పిట్‌లోని ఎమర్జేన్సీ ఎక్విప్‌మెంట్స్‌లో దీనిని స్టోర్‌ చేయాలాని FAA ప్రమాద దర్యాప్తు పత్రం చెబుతోంది. ఈ మేరకు ఇది ఒక రక్షణ సాధనంగా పనిచేస్తుంది.

Reasons behind crash axe in cockpit know the reasons behind fly dubai incident

విమానంలో ఇద్దరు పైలట్లు ఎందుకు.?

సాధారణంగా పెద్ద విమానాల్లో ఒక కెప్టెన్‌, ఫస్ట్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఇద్దరికీ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. కానీ లక్ష్యం ఒకటే. విమానాన్ని సురక్షితంగా ఉంచడం. ఒకరు 'పైలట్‌ ఫ్లయింగ్‌’ పాత్రను పోషిస్తారు. మరొకరు 'పైలట్‌ మానిటరింగ్‌’ చేస్తారు. ఎక్విప్‌మెంట్స్‌, రేడియోలు, చెక్‌లిస్ట్‌లు, విమాన కార్యకలాపాలను పర్యవేక్షించడం పైలట్‌ మానిటరింగ్‌ కర్తవ్యం. అయితే అవసరాన్ని బట్టి వీరిద్దరూ పాత్రలు మార్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో రెండూ చేయాల్సి ఉంటుంది.

ఇద్దరు వ్యక్తుల నియమం

కాక్‌పిట్‌లో కనీసం ఇద్దరు అధీకృత సిబ్బంది ఉండటమనేది కీలకమైన భద్రతా చర్యల్లో ఒకటి. వారిద్దరిలో కనీసం ఒకరు నియంత్రణల వద్ద ఉండాలి. ఒకరు ఏవైనా కారణాల వల్ల కాక్‌పిట్‌ను విడిచిపెట్టినా, అకస్మాత్తుగా విమానాన్ని నడపలేక పోయినా రెండో అధీకృత సిబ్బంది అందుబాటులో ఉండి పర్యవేక్షించడం అవసరం.

ప్లై దుబాయ్‌ సంఘటన

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కాక్‌పిట్ లోపల ఒమన్‌కు చెందిన కో-పైలట్, భారతీయ ప్రధాన పైలట్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దారుణంగా దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ భయానక ఘటనలో స్మిత్‌ తీవ్రంగా గాయపడినా.. భారతీయ పైలట్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. దాదాపు 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచారు. కెప్టెన్‌కి తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. డోర్‌ లాక్‌ను అన్‌లాక్‌ చేసి విమానంలోని ఇద్దరు ఆఫ్‌ డ్యూటీ పైలట్ల సాయంతో సౌదీలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Story first published: Friday, October 2, 2026, 7:00 [IST]
Desktop Bottom Promotion