Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Viral Videos : పట్టపగలు కత్తితో దాడి చేసి నగలు చోరీ..నెత్తిపై రెండు సిలిండర్లు బ్యాలెన్స్.. వైరల్ వీడియోలు..!
నెత్తిపై ఒక బిందను పట్టుకోకుండా బ్యాలెన్స్ చేయడానికి మనం ముప్ప తిప్పలు పడుతుంటాం. అలాంటి ఒక మహిళ రెండు గ్యాస్ సిలిండర్లను బ్యాలెన్స్ చేస్తూ దానిపై మరో బిందను పెట్టి పడకుండా నిలబడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన నీతూ అనే మహిళ చేసిన ఈ సాహస దృష్యం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన కొన్ని నిమిశాల్లోనే వేల లైక్సను సొంతం చేసుకుంది. నీతూ5650 పేరుతో వున్న ఈ ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమె ఇలాంటి ఎన్నో వీడియోలను పోస్ట్ చేసింది.
ఈ వీడియోపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని అంటున్నారు. ఒక మహిళ తలచుకుంటే సిలిండర్లు ఏంటి, మొత్తం ఇంటి బరువునే తలపై ఎత్తుకోగలదు అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇండియా మోస్ట్ ట్యాలెంటెడ్ షోకు కూడా మీరు వెళ్లవచ్చని ఇంకో యూజర్ తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరిచాడు.

భారత రైల్వేలో సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయ్. దీనికి సంబంధించిన వీడియోలు కూడా పెరిగిపోతూనే వున్నాయ్. ఒక రోజూ రైలు భోగీలు బాగా కిక్కిరిసనట్లు వున్న వీడియో, మరో రోజు రైలు భోగీల మధ్య కప్లింగ్‌లో సామాన్య జనాలు బలవంతంగా ఎక్కుతున్న వీడియో ఇలా చాలా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. భారతీయ రైల్వేలో తాజాగా మరో సమస్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మరింది. ఏసీలు వున్న భోగీలు, సీట్లు బుక్ చేసకున్నా ఏసీ పనిచేయడం లేదని ప్రయాణికులు టీసీని రైల్వే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీనికి వారు కూడా సరైన సమాధాన చెప్పడం లేదు.
పిల్లలకు బట్టలు విప్పి గాలి ఆడేలా చేస్తున్నామని చెప్పినా రైల్వే సిబ్బంది సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కువ డబ్బులు కట్టి ప్రయాణించినా లాభం లేకపోయిందని ఆవేదనను సదరు ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. 2023 జూన్‌లో బాలాసోర్ దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వేలో వున్న లోపాలు మరింతగా ప్రజలకు వీడియో రూపంలో వస్తున్నాయ్.
హైదరాబాద్ మేడ్చల్‌లో దొంగలు పట్టపగలు కత్తితో పొడిచి బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. జరిగిన దృష్యం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మేడ్చల్‌లోని జగదాంబా జెవలర్స్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఒకరు హెల్మెట్ పెట్టుకొని, మరొకరు బురఖా వేసుకొని బంగారు దుకాణంలోకి వచ్చారు. కత్తితో షాపు యజమానిపైన దాడి చేశారు. పోలీసులు 16 బృందాలను రంగంలోకి దింపి ఎట్టకేలకు వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
అయితే దొంగతనానికి పాల్పడే ముందు మూడు సార్లు షాపులో రెక్కీ నిర్వహించనట్లు చెప్పారు. ఈ వీడియోపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యజమానికి కత్తి పోటు పడ్డా ధైర్యంగా ఇద్దరినీ ఎదుర్కొన్నారని అన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో బుర్ఖాలను బ్యాన్ చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడ్డ వారి పేర్లు నజీం, సొహైల్‌గా పోలీసులు గుర్తించారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన దొంగతనంలో కూడా ఇద్దరి హస్తం వుందని అన్నారు.



Click it and Unblock the Notifications
