Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
ఔరంగజేబు సమాధికి కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..శివాజీ ఆలయానికి మాత్రం చిల్లర!
బాలీవుడ్ హీరో విక్కీకౌశల్ నటించిన ఛావా సినిమా గత నెలలో మరాఠీ,హిందీలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ కోరిక మేరకు ఈ సినిమాను మార్చి 7న తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఔరంగజేబుకు సంబంధించిన అంశం దేశంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి..ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే..ఛావా సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారైడన సంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ఎలా హింసించి చంపారో చూపించారు.
మతం మారితే చాలు సకల భోగాలను అందిస్తానన్న ఔరంగజేబు ఆఫర్ ని నిర్ద్వందంగా తిరస్కరించి ప్రాణాలను సైతం వదిలిన మహావీరుడైన సంభాజీ జీవిత చరిత్రను ఛావా సినిమాలో చూపించారు. శివాజీ వర్సెస్ ఔరంగజేబు డిబేట్ నడుస్తున్న సమయంలో ఆర్టీఐలో ఇప్పుడు ఓ పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ఇది మహారాష్ట్ర రాజకీయాల అగ్నికి ఆజ్యం పోసింది. అదేంటంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఔరంగజేబు కోసం ప్రతి సంవత్సరం దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తుందని..అదే సమయంలో మహారాష్ట్ర అద్భుతమైన చరిత్రకు ప్రతీక అయిన మహారాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి శివాజీ ఆలయానికి ఏడాదికి రూ.6030..అంటే నెలకు కేవలం రూ. 250 మాత్రమే ఆర్థిక సహాయం చేస్తున్నారని ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యే సస్పెండ్
మహారాష్ట్రలో శివాజీ వర్సెస్ ఔరంగజేబు చర్చ కొత్త రాజకీయ తుఫానుకు దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ మొఘల్ పాలకుడైన ఔరంగజేబుని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడంతో అజ్మీని గత వారం మార్చి 26న బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు మహారాష్ట్ర శాసనసభ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఆలయాన్ని నిర్వహించే ట్రస్ట్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,030 ఆర్థిక సహాయం అందిస్తుందని, కేంద్ర ప్రభుత్వ పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఔరంగజేబు సమాధి నిర్వహణకు ఏటా రూ.2 లక్షలు ఖర్చు చేస్తుందని ఆర్టీఐ వెల్లడవడంతో ఈ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హిందూ సంఘాలు ఆగ్రహం
హిందూ జనజాగ్రణి సంఘం ప్రకారం..ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంతోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI).. ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనికి సంబంధించి అందిన సమాచారం ప్రకారం 2021-22 సంవత్సరంలో రూ.2,55,160.. 2022-23 సంవత్సరంలో రూ.2,00,636 ఖర్చు చేశారు. ఈ లెక్కన చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
ఆర్టీఐలో ఈ విషయాలు వెల్లడైనప్పటి నుండి అనేక హిందూ సంస్థలు వివిధ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారతదేశాన్ని నాశనం చేసిన ఔరంగజేబు సమాధికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ, ఛత్రపతి శివాజీకి ఇంత తక్కువ చెల్లించడం ద్వారా ఇంత వివక్ష ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి. ఔరంగజేబు సమాధి నిర్వహణకు ఈ సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని హిందూ జనజాగృతి సమితి కూడా డిమాండ్ చేసింది. హిందూ జనజాగరణి సంస్థ కూడా పుణ్యక్షేత్రాలు, దేవాలయాల మధ్య వివక్షతపై తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది. ఔరంగజేబు సమాధికి అందిస్తున్న సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని, ఈ సహాయాన్ని ఛత్రపతి శివాజీ ఆలయానికి అందించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.



Click it and Unblock the Notifications