Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
భారత్ లో అత్యంత సురక్షితమైన పర్యాటక ప్రదేశం ఇదే..ఇప్పటిదాకా ఎలాంటి దాడి లేదు..టూరిస్టులకు స్వర్గధామం
సమ్మర్ సీజన్ లో స్కూల్స్, కాలేజీలకు హాలిడేస్ ఉంటాయి. ఈ సమయంలో చాలామంది టూర్స్ ఫ్లాన్ చేసుకుంటారు. అయితే ఈ సమ్మర్ లో టూర్ కి వెళ్లదామనుకున్నోళ్లు ప్రస్తుతం టెన్షతో భయపడిపోతున్నారు. దీనికి కారణం మొన్న కశ్మీర్ లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరగడమే. అప్పటినుంచి టూర్ పేరేత్తితేనే కొంతమంది భయపడిపోతున్నారు. విహారయాత్రకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. టూర్ లేకపోతే పోయింది ప్రశాంతంగా ఇంట్లో ఉంటే చాలు అని అంటున్నారు.
ఇప్పటికే కశ్మీర్ టూర్ కోసం ట్రావెల్ ప్యాకేజీ బుక్ చేసుకున్నోళ్లు, ట్రైన్, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకునోళ్లు దాదాపు అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమ్మర్ లో హాలిడే ట్రిప్ కు ఎక్కడికెళ్తే సేఫ్ అని కొందరు గూగుల్ లో వెతికేస్తున్నారు. హాలిడే ట్రిప్ ఫ్లాన్ చేస్తే ముందుగా భద్రత గురించే అందరూ ఆలోచిస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ,పిల్లలతో ట్రావెల్ చేసేవాళ్లు సురక్షితమైన, ప్రశాంత ప్రదేశం కోసం చూసుకుంటారు. మనదేశంలో అందంతో పాటు సేఫ్ గా ఉండే టూరిస్ట్ ప్లేస్ లు బోలెడు ఉన్నాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి ఒకటి.

ఇది చాలా బెస్ట్ అండ్ సేఫ్
మనదేశంలో అత్యంత సురక్షితమైన టూరిస్ట్ ప్లేస్ లలో పాండిచ్చేరి ఒకటి. ఇది చాలా అందమైన,ప్రశాంతమైన ప్లేస్. పాండిచ్చేరిలో ఇప్పటిదాకా పెద్దగా ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఎలాంటి నేర ఘటనలు లేవు. టూరిస్టులకు ఇది చాలా సేఫ్ ప్లేస్ అని చెబుతుంటారు. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. దక్షిణ భారతదేశంలో కేరళకు దగ్గర్లో ఉండే ఈ తీరప్రాంత ప్రదేశంలో పర్యటాకులు చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ల పాలనలో ఉండేది..కాబట్టి ఇక్కడ ఫ్రెంచ్ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రెంచ్ శైలిలో నిర్మించిన అందమైన భవనాలు, వీధులు, కేఫ్ లు కనిపిస్తాయి. ఇది ఫోటోగ్రఫీకి చాలా అనువైన ప్రదేశం.
అనేక అద్భుత బీచ్ లు, పురాతన చర్చిలు, సీఫుడ్, తక్కువ ధరల్లో లభించే రూములు, ఫేమస్ టెంపుల్స్, ఫ్రెంచ్ శైలి నిర్మాణాలు, అరబిందో ఆశ్రమం, బోటు ప్రయాణాలు, లోకల్ మార్కెట్ లో షాపింగ్ పాండిచ్చేరి పర్యాటకులకు అనేక ఆకర్షణలను కలిగి ఉంది. అంతేకాకుండా భారీగా ఖర్చు కూడా ఉండదు. తక్కువ ఖర్చులోనే పాండిచ్చేరి ట్రిప్ తో భిన్నమైన అనుభూతులను పొందవచ్చు. పాండిచ్చేరి ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. టూరిస్టుల విషయంలో పోలీసు వ్యవస్థ, అడ్మినిష్ట్రేషన్ కూడా కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలుంటాయి. ఏదైనా చిన్న ఇష్యూ వస్తే వేగంగా రియాక్షన్ ఉంటుంది. యోగాని ఇష్టపడేవాళ్లకి కూడా ఇదొక బెస్ట్ ప్లేస్. పాండిచ్చేరి సిటీకి కొద్ది దూరంలో ఉండే అరోవిల్లేలోని ధ్యాన కేంద్రం అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. సోలో ట్రావెలర్స్ కి కూడా పాండిచ్చేరి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications