Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శనిదోషం తొలగిపోవాలంటే.. శనివారం రోజు ఈ శని మంత్రాన్ని పఠించండి
చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అన్నీ బాగున్నా కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి. దాని వల్ల జీవితం అంతా కష్టాలమయం అవుతుంది. కొందరు చేతినిండా సంపాదిస్తారు. కానీ అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులతో చేతిలో రూపాయి కూడా నిలవదు. మరికొందరు బాగానే సంపాదిస్తారు.. కానీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలతో డబ్బు ఉన్నా, ప్రశాంతత లేక ఇబ్బంది పడిపోతారు.
జీవితంలో శనిదోషం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. అన్నీ బాగుంటాయి కానీ చిన్న చిన్న సమస్యలే జీవితాన్ని అధోఃగతి పాలు చేస్తాయి. డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇలాంటి సమస్యలకు శనిదోషమే కారణం. జీవితంలోని సమస్యలు తొలగిపోవడానికి, జీవితం సాఫీగా, ఆనందంగా సాగడానికి శనివారం రోజు శనికి సంబంధించిన ఈ మంత్రాన్ని పఠించాలి. శని సాడే సతీ మంత్రం జపించడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. మరి శని సాడే సతీ మంత్రి ఎలా జపించాలంటే..

శని సాడేసతి మంత్రం:
హ్రీం ఓం నమః శివాయ హ్రీం
సాడేసతి నివారణ మంత్రాన్ని ఎలా పఠించాలంటే..
సాడేసతి మంత్రాన్ని పఠించడానికి ఉత్తమం సమయం శనివారం తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు లేదా సాయంత్రం సూర్యస్తమయం ఈ మంత్రాన్ని పఠించడానికి ఉత్తమ సమయంగా చెబుతారు. అలాగే మంత్రం పఠించే సమయంలో తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే మంత్రాన్ని పఠించే ముందు గణేషుడిని ప్రార్థించాలి. దీపం వెలిగించాలి. మనసులో శివుడిని స్మరించుకోవాలి. రుద్రాక్షి జపమాల పట్టుకుని సాడే సతి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత పూల చెట్లకు నీరు పోసి నమస్కరించాలి.
దానం చేయడం, నలుగురికి భోజనం పెట్టడం కూడా..
పేదలకు, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. తోచినంత సాయం చేసి ఫలితం ఆశించకూడదు. అలాగే ఈ రోజు బ్రహ్మణులకు నలుపు రంగు వస్తువులు దానం చేయాలి. లేదంటే డబ్బు దానం చేయాలి. నల్ల దుప్పటి, నల్లని నువ్వులు, నల్లని బూట్లు దానం చేయడం వల్ల జీవితంలో శని దోషం తొలగిపోతుంది.
నల్ల ఆవులకు బెల్లం, నానబెట్టిన శనగలు..
ఈ రోజు నల్ల ఆవులకు బెల్లం, నానబెట్టిన శనగల ఆహారం ఇవ్వడం వల్ల దోష తొలగిపోతుంది. అలాగే శనివారం నలుపు రంగు ఇతర జంతువులకు కూడా ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం తొలగిపోతుంది.
ఇలా చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది..
పుష్య నక్షత్రం రోజు శని దేవునికి కొబ్బరి, అరటి, నల్ల నువ్వులు, గొడుగు, ఇనుము, నూనె, నల్లని వస్త్రం వంటివి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దేవును కృప కలుగుతుంది. దోషం తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications