Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఫ్రెండ్ కి లింగమార్పిడి చేయించి మరీ అత్యాచారం!..అయినా కూడా వదల్లేదు..
స్నేహం ముసుగులో జరిగిన ఒక దారుణమైన నేరం వెలుగుచూసింది. నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు. తలనొప్పికి ట్రీట్మెంట్ అని నమ్మించి రహస్యంగా హార్మోన్లు ఇచ్చి బలవంతంగా లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడి రూ.10 లక్షల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ నరకం చూపిస్తున్నాడంటూ 27 ఏళ్ల యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫ్రెండ్ కి లింగమార్పిడి చేయించి మరీ అత్యాచారానికి పాల్పడటంతో పాటు అతడు తనతో తరచూ శృంగారంలో పాల్గొనేలా చేయడానికి చేతబడుతులు కూడా చేయించాడు.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసేన్ జిల్లాకు చెందిన బాధితుడు 10 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం భోపాల్ లోని తమ చుట్టాల ఇంటికి వెళ్లాడు. అక్కడ శుభమ్ అనే వ్యక్తితో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. వీరి స్నేహం బలపడటంతో ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్‌మెంట్ లో అద్దెకు దిగారు. కొంతకాలానికి శుభమ్.. బాధితుడిపై లైంగిక ఆసక్తి పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. పూర్తి మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని శుభమ్ షరతు పెట్టాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం బాధితుడికి నిరంతరంగా తలనొప్పి వస్తోందని,ట్రీట్మెంట్ చేయిస్తానని నమ్మించి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడే అసలు కుట్ర మొదలైంది.

తలనొప్పి మందుల పేరుతో బాధితుడికి తెలియకుండా శుభమ్.. హార్మోన్ థెరపీ ఇవ్వడం ప్రారంభించాడు. నెల రోజుల్లోనే తన శరీరంలో వింత మార్పులు గమనించి భయపడ్డానని బాధితుడు తన ఫిర్యాదులో తెలిపాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే శుభమ్ అతడిని ఇండోర్ కు తీసుకెళ్లి బలవంతంగా లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. దీని కోసం బాధితుడి చేతే రూ.5 లక్షలు ఖర్చు పెట్టించాడు. చివరికి పెళ్లికి నిరాకరించాడు. అంతకుముందు కూడా పెళ్లి పేరుతో శుభమ్ తనను శారీరకంగా, లైంగికంగా వాడుకున్నాడని, వింత తాంత్రిక పూజలు కూడా చేయించాడని బాధితుడు ఆరోపించాడు.
పురుషుడిగా ఉన్న తనను బలవంతంగా స్త్రీగా మార్చిన తర్వాత తన ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో తెలిపాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటపెడతానంటూ బాధితుడిని బెదిరించి, రూ.10 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని తెలిపారు. ఈ ఘోరమైన మోసంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా శుభమ్ పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నేరం జరిగిన ప్రాంతం నర్మదాపురం కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితుడిపై అత్యాచారం, వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా లింగమార్పిడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం నిందితుడు శుభమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.



Click it and Unblock the Notifications