Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
కరోనా చదువులేమో: కొడుక్కి చేయాల్సిన ఆపరేషన్..తండ్రికి చేసిన డాక్టర్లు!..తర్వాత షాకింగ్..
రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడి హాస్పిటల్ కి వెళ్తే అతడికి ట్రీట్మెంట్ చేయడం మానేసి ఏ జబ్బూ లేని అతడి తండ్రికి ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఈ వింత ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట మెడికల్ కాలేజీలో గత శనివారం జరిగింది. పేషేంట్ కి ఆపరేష్ చేయకుండా పేషెంట్ తండ్రికి ఆపరేషన్ చేయడం ఏంట్రా స్వామి అని ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ డాక్టర్లపై సెటైర్లు వేస్తున్నారు. కరోనా టైంలో డాక్టర్ కోర్సు చేశారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు హాస్పిటల్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
రాజస్థాన్ రాష్ట్రంలోని బారన్ జిల్లాలోని అట్రూ(Atru)కి చెందిన మనీష్ పంచాల్(33) గతవారం ఓ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. దీంతో మనీష్ ట్రీట్మెంట్ కోసం కోట మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యాడు. గత శనివారం మనీష్ కాలుకి ప్లాస్టిక్ సర్జరీ ఆపరేష్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో సపోర్ట్ కోసం మనీష్ తన తండ్రి జగదీష్(60) హాస్పిటల్ కు పిలిచాడు. మనీష్ తండ్రికి అప్పటికే పక్షవాతం ఉంది. అయినప్పటికీ తన కొడుకు కోసం హాస్పిటల్ కి వెళ్లాడు. తర్వాత మనీష్ ని కలిశాడు. కొద్దిసేపటి తర్వాత ఆపరేష్ థియేటర్ బయట వెయిట్ చెయ్యాలని మనీష్ తన తండ్రికి సూచించాడు. అయితే ఏమైందో ఏమీ తెలియదు గానీ తన తండ్రి శరీరం మీద 5-6 కుట్లు ఉన్నాయని మనీష్ చెప్పాడు.

తాను ఆపరేషన్ థియేటర్లో ఉన్న సమయంలో అక్కడ జగదీష్ అని ఎవరో పిలవడం తాను విన్నానని,ఆ పిలుపుకి తన తండ్రి స్పందించాడని..దీంతో ఆయనను లోపలికి తీసుకెళ్లారని..ఏ డీటెయిల్స్ చెక్ చేయకుండా తన తండ్రికి హాస్పిటల్ స్టాఫ్ అనస్థీషియా ఇచ్చి,ఆయన చేతికి గాటు పెట్టారని..తర్వాత చూస్తే 6-7 కుట్లు కనిపిస్తున్నట్లు మనీష్ చెప్పారు. తన తండ్రి హాస్పిటల్ లో పేషెంట్ కాదని, ఎలాంటి గాయాలు లేవని,కనీసం సర్జరీ ముందు వేసుకునే గౌన్ కూడా ఆయనకు లేదని చెప్పాడు. గత 10 ఏళ్లుగా తన తండ్రి పక్షవాతంలో బాధపడున్నాడని..ఆయన మాట్లాడటం కూడా చాలా నెమ్మదిగా ఉంటుందని చెప్పాడు.
తనకు ఏ డాక్టర్ ఆపరేష్ చేశాడో కూడా తనకు తెలియదని మనీష్ చెబుతున్నాడు. తాను ఇంకా బెడ్ మీదనే ఉన్నట్లు చెప్పాడు. తనకు ఎవరు సాయం చేయట్లేదని వాపోయాడు. అయితే ఈ ఇష్యూపై మనీష్ నుంచి కంప్లెయింట్ రావడంతో కోట మెడికల్ కాలేజీ స్పందించింది. ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కోట మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ని కోరినట్టు కోట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంగీత సక్సేనా తెలిపారు. కమిటీ ఏర్పాటైందని..2-3రోజుల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని సక్సేనా తెలిపారు.



Click it and Unblock the Notifications