Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
షాకింగ్..టాయిలెట్ సీటు పేలి యువకుడికి తీవ్ర గాయాలు!
ఈ బిజీ లైఫ్ లో ప్రశాంతంగా ఉండేది బాత్రూమ్ లోనే అంటూ తరచుగా చాలామంది జోక్స్ వేసుకుంటుంటారు. అయితే బాత్రూమ్ కి వెళ్లడం ఓ వ్యక్తికి పీడకలలా మారింది. అతను కూర్చున్న టాయిలెట్ సీట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతనికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. టాయిలెట్ సీటు పేలడం ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సిటీలోని సెక్టార్ 36లో అషు అనే 20 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఎప్పటిలానే అషు బాత్రూమ్ కి వెళ్లి టాయిలెట్ సీటు మీద కూర్చున్నాడు. అయితే ఉన్నట్లుండి అది బ్లాస్ట్ అయ్యింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు అషుని వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS)కు తరలించారు. అషుకి 35శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే బాత్రూమ్ కి వెళ్లిన టైంలో అషు ఫోన్ కానీ లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడలేదని ఆషు తండ్రి సునీల్ ప్రధాన్ చెబుతున్నారు. బాత్రూమ్ లో పేలుడు ఎలాంటి గాడ్జెట్స్ కారణం కాదని..కేవలం టాయిలెట్ సీటు మాత్రమే బ్లాస్ట్ అవడం తమను కూడా షాక్ కు గురిచేసినట్లు ఆయన తెలిపారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడుకు ఎటువంటి విద్యుత్ సమస్య కారణం కాలేదు. ఆ సమయంలో ఇంట్లో ఏసీ, ప్రతి ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ బాగానే పనిచేస్తున్నాయి.. కానీ ఊహించని విధంగా మీథేన్ వాయువు పేరుకుపోవడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. టాయిలెట్ సీటు లోపల పేరుకుపోయిన మురుగుకాలవ మూసుకుపోవడం వల్లే ఇలా జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా వస్తాయని..ముఖ్యంగా పాతబడిన లేదా సరిగ్గా మెయింటెన్స్ లుని ప్లంబింగ్ సిస్టమ్స్ ఉన్న ఇళ్లలో ఇలాంటి పేలుడులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పైపులు చాలా పాతవిగా ఉండి, చాలా ఏళ్లుగా వాటిని క్లీన్ చేయకుంటే.. మూసుకుపోయిన పైపులు గ్యాస్ పేరుకుపోవడానికి దారితీస్తాయని..ఇది ఒత్తిడిలో పేలిపోయే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
డ్రైనేజీలు మూసుకుపోయినప్పుడు లేదా వెంటిలేషన్ సరిపోనప్పుడు పరిమిత బాత్రూమ్ స్థలం,మురుగునీటి కాలవల్లో మీథేన్ పేరుకుపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇంటి ఓనర్స్ తమ పాత ఇల్లలోని పంబ్లింగ్ సిస్టమ్ ను ప్రమాదకరమైన వాయువు పేరుకుపోకుండా ఉండటానికి తరచుగా క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications