Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రూ.10వేలు పెరిగిన బంగారం ధర..డబ్బున్నోళ్లు కొనడంలే..త్వరలో తగ్గనుందా!
అంతరిక్షంలోకి రాకెట్ దూసుకెళ్లినట్లుగా మార్కెట్ లో బంగారం ధర దూసుకెళ్తోంది. ఇప్పటికే సామాన్యుడు అందుకోలేనంత దూరం వెళ్లిపోయిన బంగారం ధర ఇప్పుడు శ్రీమంతులకు కూడా కొనేందుకు వెనకాడేలా చేస్తోంది. రోజు రోజుకి పెరగడమే తప్ప తరుగుదల ఏ మాత్రం కనబట్లేదు. ఈ నెలలోనే తులం బంగారం ధర రూ.1 లక్ష దాటిపోతుందా అని అనిపిస్తుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 1 లక్ష దాటినా పెద్దగా ఆశ్చర్యపోనక్కరేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2025లో సామాన్యులు బంగారం కొనడం కలగానే మిగిలిపోయే పరిస్థితి కనబడుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేటోళ్లు కూడా బంగారం కొనాలంటే బాగా ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది తమ కొనుగోలు ప్రణాళికలను పెరుగుతున్న ధరలతో వాయిదా వేసుకుంటున్నారు.
ఇప్పటికే స్పాట్ మార్కెట్ లో కూడా నిపుణుల అంచనాలకు మంచి రేటు పెరిగిపోతుంది. ఈ బంగారం ధర పెరుగుదల ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితి అందరిలో నెలకొంది. బంగారం ధర ఈ సంవత్సరంలోనే రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం దాటి పరుగులు పెడుతుంది. గత వారం స్వల్పంగా వెండి ధరలు తగ్గినప్పటికీ మళ్లీ భారీగా ర్యాలీ కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో ఒడిదుకులే బంగారం,వెండి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

గడిచిన 3 రోజులుగా చూస్తే 22 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర ఏకంగా రూ.10వేలు పెరుగుదలను నమోదుచేసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్,ప్రతీకార సుంకాల నిర్ణయాల కారణంగా అమెరిక ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు నడుస్తుందా అనే ఆందోళనలో పెట్టుబడిదారులందరూ తమ డబ్బులను బంగారం వంటి విలువైన మెటల్స్ వైపు తరలిస్తున్నారు. దీనికి సాక్ష్యం కొద్దిరోజులుగా అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడమే. ఎక్కువ మంది పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారంలోకి తమ డబ్బును తరలిస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయి బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా మండిపోతున్నాయి.
హైదరాబాద్,విజయవాడలో ఇవాళ(మార్చి 20) బంగారం ధరల వివరాలు
హైదరాబాద్ లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి పోల్చితే 100 గ్రాములకు రూ.2000 పెరిగింది. దీంతో ఈరోజు 22 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ. 83,100 గా ఉంది. బుధవారంతో పోల్చితే తులం మీద రూ.200 పెరిగింది.
హైదరాబాద్ లో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660గా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే 22 రూపాయలు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. రూ. 83,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90, 660గా ఉంది.
వెండి ధరలు
విజయవాడలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.1,14,100గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.
హైదరాబాద్ ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.రూ.1,14,100గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.
వ్యాపారుల ఆందోళన
వివిధ దేశాలలో కొనసాగేతున్న అనిశ్చితి వాతావరణం, పలు చోట్ల యుద్ధ వాతావరణం, పలు దేశాల్లో అంతర్యుద్దం వంటి పరిణామాలన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషపడేలోగా వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా బంగారం ముట్టుకుంటే షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని సమాన్యులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications