Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్యాంకాక్ లో సునామీ వస్తుందా? అల్లకల్లోలం..భయంతో జనం పరుగో పరుగు,వీడియోలు చూడండి
యమన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నాం 12: 50 సమయంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. సంగైంగ్ సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో భూమిలోపల 10 కి.మీ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రతకు మండలేలో ఇర్రవడ్డీ నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కూలిపోయింది.
మరోవైపు, బ్యాంకాక్ లో కూడా 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. ఉత్తర థాయిలాండ్ మొత్తం భూప్రకంపనలు వచ్చాయి. పలుచోట్ల భవనాలు కూలిపోయాయి. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనాలు ఊగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బిల్డింగ్ పై అంతస్థులోని స్విమ్మంగ్ పూల్ లోని వాటర్ కిందకు పడుతున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భూకంపం నేపథ్యంలో బ్యాంకాక్ లో భవనాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.

థాయిలాండ్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. సునామీ హెచ్చరికలు ఇప్పటివరకైతే జారీ చేయలేదు. మరోవైపు ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు జరిగిన ప్రాణ,ఆస్తి నష్టంపై ఇంకా వివరాలను అధికారులు వెల్లడించలేదు. మయన్మార్, బ్యాంకాక్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
బ్యాంకాక్, యయన్మార్ ఎఫెక్ట్ తో భారత్, బంగ్లాదేశ్,లావోస్,చైనాలో కూడా భూకంపం వచ్చింది. మనదేశంలో ఢిల్లీ, కోల్ కతా,మణిపూర్,మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి.



Click it and Unblock the Notifications