Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్తపడండి..!
దేశంలో స్వై ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిికే అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కరోనా తరువాత మరింత ప్రమాదకరమైన వైరస్ మనుషులను కబలించే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళలను కలిగిస్తే రాజస్థాన్, అస్సాంలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు భయాన్ని పుట్టిస్తున్నాయ్. ఆ రెండు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతండడంతో ఆ రాష్ట్రాలు అక్కడ హై అలెర్ట్‌ను ప్రకటించాయ్.
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు, రాష్ట్రాలు అప్రమత్తం
దేశంలో మొట్టమెదటి స్వైన్ ఫ్లే కేను 2009లో నమోదైంది. పందుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అయితే ఇది అత్యంత ప్రమాదకరంగా వ్యాపించే అంటువ్యాధని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పంది మాంసం తినే అలవాటు వుంటే ఈ స్వైన్ ఫ్లూ వచ్చిన సమయాల్లో దాన్ని తినడం మానివేయాలని అంటున్నారు.
స్వైన్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలను ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం వుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాం.

దగ్గు
దగ్గు రావడం సహజం కానీ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. దగ్గు లక్షణం ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి. స్వైన్ ఫ్లే లక్షణాలు అన్ని వున్నాయా అని చెక్ చేసుకోవాలి.
వణుకు
ఇది ఎండాకాలం. ఈ వాతావరణంలో కూడా వణుకు వస్తే చిన్న సమస్యగా తీసుకోవద్దు.
ముక్క కారటం
దగ్గ, వణుకుతో పాటు ముక్కు కారితే జలుబు చేసిందని అనుకుంటారు, కానీ ఈ మూడు లక్షణాలు ఉంటే ఖచ్ఛితంగా అనుమానం పడాల్సిన అవసరం వుంది.
తలనొప్పి
ఇటు జలుబు లక్షణాలతో పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. తలనొప్పిని పట్టించుకోకుండ ాఉండకుండా వెంటనే జాగ్రత్త పడాలి.
పై లక్షణాలతో పాటు జ్వరం, అలసట, గొంతునొప్పి, వాంతులు కూడా అవుతాయ్. ఇన్ని రకాల లక్షణాలు ఒక్కసారిగా వస్తే అది ఖచ్చితంగా స్వైన్ ఫ్లూగానే ముందుగా నిర్ధారణకు వచ్చి వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
కొందరిలో ఈ స్వైన్ ఫ్లూ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురౌతారు. వృద్ధులు, గర్భిణీలు, డయాబెటిస్ వ్యాధికి గురైన వారు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ స్వైన్ ఫ్లూ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ నివారించడానికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆరు నెలలకు పైబడిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాధి గాలిద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఉన్నాయని భావించే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, సానిటైజర్‌తో తరచుగా చేతులు శుభ్రాం చేసుకోవడం చేయాలి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలకు కూడా వెళ్లకూడదు.
స్వైన్ ఫ్లూ సోకితే ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. వైద్యులు చెప్పిన మందులు వాడుతూ పళ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే తగ్గిపోతుంది. సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతిని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సమయంలో మంచి పోషకాహారాన్ని తీసుకుంటే స్వైన్‌ఫ్లూ సోకినా ఎటువంటి భయానికి గురి కావాల్సిన అవసరం వుండదు.



Click it and Unblock the Notifications