Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Teachers Day 2023: సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు
Teachers Day 2023: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ.. తల్లిదండ్రుల వంటి ప్రత్యక్ష దైవాల తర్వాతి స్థానం గురువుదే. గురువు స్థానం అత్యంత విలువైనది. విద్యా బుద్ధులు నేర్పడంతో పాటు మానవ విలువలు చెప్పే గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉంటారు. అది విద్యాబుద్ధులు చెప్పే వారు, జీవిత పాఠాలు బోధించే వారు, జీవన నైపుణ్యాలు నేర్పే వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. అందుకే ఉపాధ్యాయ వృత్తి కంటే గౌరవనీయమైనది, బాధ్యతాయుతమైనది మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు.

సెప్టెంబర్ 5 వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తత్వవేత్త నుండి భారత రాష్ట్రపతి వరకు వివిధ పాత్రలు పోషించారు. అయితే ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషిని ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. రాధాకృష్ణన్ తన జీవితాన్ని విద్య కోసం, విద్యారంగంలో ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అంకితం చేశారు. "నా పుట్టినరోజును జరుపుకునే బదులు, సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అదృష్టంగా భావిస్తాను" అని డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో చెప్పారు. అప్పటి నుండి, ఆయన పుట్టినరోజున, అంటే సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

భారతరత్న డాక్టర్ రాధాకృష్ణన్ ప్రతి ఒక్కరికీ విద్య అందించడం కోసం నిస్వార్థంగా పని చేశారు. నిష్కళంకమైన సేవలు అందించారు. చాలా మందికి ఆయన ఓ రోల్ మోడల్. జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు ఆయన పలు సందర్భాల్లో కొన్ని కోట్స్ చెప్పారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 1
పుస్తకాలు.. సంస్కృతులు, సాంప్రదాయల మధ్య వంతెనలు నిర్మించే సాధనాలు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 2
ఉపాధ్యాయులు దేశంలోనే అత్యుత్తమ మనసు ఉన్నవారిగా ఉండాలి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 3
ఒక మేధావి, అందరిలా ఉండగలడు, కానీ ఎవరూ అతనిలా ఉండలేరు

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 4
సంతోషకరమైన జీవితం సైన్స్, నాలెడ్జీ ఆధారంగా మాత్రమే సాధ్యమవుతుంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 5
అంతా తెలుసు అనుకున్నప్పుడు, నేర్చుకోవడం మానేస్తాం.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 6
విద్య వ్యక్తిని స్వేచ్ఛా, సృజనాత్మకమైన వ్యక్తిగా తయారు చేయాలి. చారిత్రక మూఢనమ్మకాలను, ప్రకృతి విపత్తలను ఎదుర్కొనేలా తయారవ్వాలి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 7
మన గురించి మనం ఆలోచించుకోవడానికి సహాయం చేసేవారే నిజమైన ఉపాధ్యాయులు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 8
మతం అనేది ప్రవర్తన మాత్రమే. నమ్మకం కాదు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 9
గొప్ప సాధువుకు చెడ్డ గతం ఉన్నట్లే, పాపికి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరూ మంచివారు లేదా చెడ్డవారు కాదు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 10
జ్ఞానం మనకు శక్తిని ఇస్తుంది. ప్రేమ మనకు సంపూర్ణతను ఇస్తుంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 11
పుస్తక పఠనం మనల్ని మనం తరచి చూసుకోవడానికి, అలాగే ఆనందాన్ని అలవాటు చేస్తుంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు 12
జీవితాన్ని చెడుగా చూడటం, ప్రపంచాన్ని మాయగా భావించడం తప్పు.



Click it and Unblock the Notifications