Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బెంగళూరులో HMPV వైరస్ కేసు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక ఆదేశాలు!
చైనాలో వేగంగా విస్తరిస్తున్న HMPV వైరస్ మన దేశంలో ప్రవేశించిందని వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో 8 ఏళ్ల ఓ చిన్నారికి ఈ HMPV వైరస్ సోకినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ ఎక్కడ మరో మహమ్మారిగా మారుతుందోనని కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? అనే సూచనలు చేశాయి. ఆ వివరాలను మనం ఈ స్టోరీలో చూద్దాం.
తెలంగాణ ప్రభుతం
చైనాలో వేగంగా విస్తరిస్తున్న HMPV వైరస్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ కేసులు నమోదు కాలేదని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ బీ.రవీందర్ నాయక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖతో తాము సమన్వయంతో పని చేస్తున్నామని HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ప్రజలందరూ తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చేతులను అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఇతరులకు షాక్ హ్యాండ్ ఇవ్వడం కూడా మానేయాలని సూచించింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కచ్చితంగా క్లాత్ ముఖానికి అడ్డం పెట్టుకోవాలని, ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ఎవరికీ వారు తమవంతు జాగ్రత్తలు పాటించాలని కోరింది.
ఏపీ ప్రభుత్వం ఏమందంటే?
చైనాలో వేగంగా HMPV వ్యాపిస్తుండడంతో పాటు బెంగళూరులో దీనికి సంబంధించిన కేసు నమోదైనట్లు వార్తలు వస్తుండడంపై ఏపీ ప్రభత్వం కూడా స్పందించింది. రాష్ట్ర ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించింది. తాము ఈ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని, రాష్ట్ర ప్రజలు దీనిపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్‌కు సంబంధించిన కేసులేమీ నమోదు కాలేదని, ప్రస్తుతం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. సులభమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వైరస్ బారిన పడకుండా ఉంటామని, ప్రతి ఒక్కరూ ఆ జాగ్రత్తలను పాటించాలని కోరింది. ఎప్పటికప్పుడు తాము చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు నిశ్చింతంగా ఉండాలని కోరింది.
అటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ వైరస్ కేసులపై స్పందించాయి. తమ తమ రాష్ట్రాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తద్వారా వ్యాధిని నివారించొచ్చని వెల్లడించాయి.



Click it and Unblock the Notifications